ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలు..

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో పెట్టుబడులు పెడతారు.

ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే మార్గాలు..
Money
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 16, 2022 | 3:13 PM

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టి ఎక్కువ ఆదాయం పొందాలనుకునేవారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో పెట్టుబడులు పెడతారు. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్స్ కేటగిరీ కిందకు వచ్చే ప్రత్యేకమైన ట్రేడింగ్ విభాగం. డెరివేటివ్ అనేది షేర్లు, బంగారం మొదలైన అంతర్లీన ఆస్తిలకు సంబంధించిన కాంట్రాక్టు కలిగి ఉంటుంది. ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడిదారులు అంతర్లీన ఆస్తిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వాటిపై పెట్టుబడి పెట్టడం ద్వారా నిర్ణీత కాల వ్యవధిలో వాటి నుండి లాభాలను ఆర్జించవచ్చు.

ఫ్యూచర్స్ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ చేస్తున్నారా: స్టాక్ మార్కెట్ లోని ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగం కాంట్రాక్టు పద్దతిని కలిగి ఉంటుంది. ఈరెండూ స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడ్డాయి. స్టాక్ మార్కె్ట్ లో ఫ్యూచర్‌లను కొనుగోలు చేస్తే.. అది స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క బాధ్యత. మీరు కాంట్రాక్టు కుదుర్చుకున్న సమయంలో ఆరోజు ఎంత ధర ఉందో ఆధరకు షేర్ పొందవచ్చు. ఆకాంట్రాక్టు ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో అంటే భవిష్యత్తులో కొనుగోలు చేసిన షేర్ పై పెరిగిన ధరను పొందవచ్చు.

ఆప్షన్స్ కాంట్రాక్ట్‌లలో ట్రేడింగ్ చేస్తున్నారా: ఆప్షన్ కాంట్రాక్ట్ లో షేర్లను మనం ఎంచుకోవచ్చు. అయితే షేర్ కొనుగోలు చేయాలా వద్దా ఆపద్ధతిలో అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ABC కంపెనీలో ఒక షేర్ విలువ రూ.2,100 అనుకుంటే.. ఒక నెల తర్వాత ఈ షేర్ విలువ రూ.2,200 అవుతుందని అంచనా వేస్తే, కాంట్రాక్ట్ ప్రీమియంగా రూ.200 చెల్లించి, ఒక నెల తర్వాత రూ.2,150కు షేర్ కొనుగోలు చేస్తామని ఒప్పందం చేసుకుంటే.. నెల తర్వాత దాని విలువ రూ.2,500 అవుతుందనుకోండి. అప్పడు షేర్ మీకు ఇచ్చేటప్పుడు విలువ రూ.2,350 అవుతుంది. అంటే ఒక్కో షేరుపై రూ.150 లాభాన్ని పొందొచ్చు.

ఒకవేళ షేర్ ధర రూ.2,000 దానిని నెలతర్వాత రూ.2,150కు కొనుగోలు చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. ఆషేర్ విలువ అనుకున్నదానికంటే పెరిగితే మనకి లాభం వస్తుంది. ఒకవేళ లాభం లేకపోతే ఆషేర్ ను కొనుగోలు చేయరు. కొనుగోలు చేయని పరిస్థితుల్లో కాంట్రాక్ట్‌కు చెల్లించిన ప్రీమియంను మాత్రమే కోల్పోతారు. అంటే నష్టపోయేది కేవలం రూ.200 మాత్రమే.

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడ్ చేయడం ఎలా: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లలో ట్రేడింగ్ ప్రారంభించడానికి మీరు బాంబే స్టాక్ ఎక్సెంజీ (BSE), నేషనల్ స్టాక్ ఎక్సెంజీ(NSE) లో రిజిస్టర్ చేయబడిన బ్రోకింగ్ సంస్థలో ట్రేడింగ్ ఖాతాను తెరవాలి. ట్రేడింగ్ ఖాతాను తెరవడానికి 5Paisa (https://bit.ly/3RreGqO) వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.  5 పైసా వెబ్ సైట్ ద్వారా మీరు అకౌంట్ ఓపెన్ చేసి F&Oలో ట్రేడింగ్ ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్ లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడింగ్ కోసం బ్రోకింగ్ సంస్థ యొక్క పోర్టల్‌లోకి లాగిన్ అయినప్పుడు మీరు వివిధ రకాల కాంట్రాక్టులు మీకు కనిపిస్తాయి. కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉత్తమమైన, మంచి కాంట్రాక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లలో ట్రేడింగ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి 5Paisa (https://bit.ly/3RreGqO) వెబ్ సైట్ ని సందర్శించండి.