Andhra Pradesh: నెల్లూరు డబుల్ మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. ఇది వారు చేసిన హత్యే..

Andhra Pradesh: నెల్లూరు డబుల్ మర్డర్‌ కేసులో మిస్టరీ వీడిపోయింది. కృష్ణారావు దంపతులను ఎవరు చంపారో? ఎందుకు చంపారో కనిపెట్టేశారు పోలీసులు.

Andhra Pradesh: నెల్లూరు డబుల్ మర్డర్‌ కేసులో వీడిన మిస్టరీ.. ఇది వారు చేసిన హత్యే..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 10:09 PM

Andhra Pradesh: నెల్లూరు డబుల్ మర్డర్‌ కేసులో మిస్టరీ వీడిపోయింది. కృష్ణారావు దంపతులను ఎవరు చంపారో? ఎందుకు చంపారో కనిపెట్టేశారు పోలీసులు. మరి, ఖాకీల ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలింది? చంపిన వాళ్లెవరు? ఎందుకు చంపారు? ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రీరామ్‌ హోటల్‌ ఓనర్‌ కృష్ణారావు దంపతుల మర్డర్‌ నెల్లూరులో భయాందోళనలు రేపింది. అందరితో కలిసిమెలిసి ఉండే కృష్ణారావు అండ్‌ సునీతలు అత్యంత పాశవికంగా హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం రేపింది. కృష్ణారావు దంపతులకు నెల్లూరు అశోక్‌నగర్‌లో మంచి పేరుంది. నలుగురికీ సాయం చేసే వాళ్లే కానీ ఎవరితోనూ ఎలాంటి విభేదాల్లేవ్‌. అలాంటిది సడన్‌గా ఇద్దరూ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ఇద్దర్నీ ఒకేరోజు గంటల వ్యవధిలో చంపేశారు దుండగులు.

అయితే, వీరిని ఎవరు చంపారో? ఎందుకు చంపారో? కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. దొంగల పనా? లేక మరేదైనా కోణం ఉందా? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టిన పోలీసులకు అతి ముఖ్యమైన క్లూస్‌ దొరకడంతో మూడ్రోజుల్లోనే కేసును చేధించారు. కృష్ణారావు దంపతుల మర్డర్‌ ఇంటి దొంగల పనిగా తేల్చారు పోలీసులు. కృష్ణారావు హోటల్‌లో పనిచేసే సప్లయిర్‌ శివనే అసలు సూత్రధారిగా గుర్తించారు. అందరి ముందు మందలించారన్న కోపం, డబ్బు కోసమే మర్డర్‌ చేసినట్లు వెల్లడించారు ఎస్పీ విజయారావు. మర్డర్‌ మిస్టరీని చేధించడంలో సీసీటీవీ ఫుటేజ్‌ కీలకంగా మారిందన్నారు ఎస్పీ. వీలున్న ప్రతివాళ్లూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో పనివాళ్ల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు నెల్లూరు ఎస్పీ విజయారావు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..