Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna River: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న వరద.. కృష్ణా ప్రాజెక్టులకు జల కళ.. అధికారులు అప్రమత్తం

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదతో కృష్ణా (Krishna River) నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా తగ్గిన వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా...

Krishna River: తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న వరద.. కృష్ణా ప్రాజెక్టులకు జల కళ.. అధికారులు అప్రమత్తం
Krihsna Projects
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 01, 2022 | 6:34 AM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వస్తున్న వరదతో కృష్ణా (Krishna River) నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కొన్ని రోజులుగా తగ్గిన వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా జూరాల, సుంకేసుల జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా రివర్‌కు ఫ్లడ్ వాటర్‌ కంటిన్యూ అవుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణా ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జూరాలకు (Jurala) భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టుకు వస్తున్న వరదను వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీశైలం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి.దాంతో కృష్ణమ్మ మరోసారి శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది. ఇక, జూరాల అప్‌ అండ్‌ డౌన్‌ పవర్‌ ప్లాంట్స్‌లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రెండు యూనిట్లలో కలిపి 470 కి పైగా మెగావాట్ల పవర్‌ జనరేషన్‌ జరుగుతోంది.

మరోవైపు తుంగభద్ర నుంచి వస్తోన్న వరద నీటితో కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజ్‌ నిండుకుండలా మారింది. వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టు గేట్లెత్తి అధికారులు నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. సుంకేసుల రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 0.84 టీఎంసీలుగా ఉంది. తుంగభద్ర నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో సుంకేసుల నుంచి కేసీ కెనాల్‌కు 2,265 క్యూసెక్కుల నీటిని వదలుతున్నారు. కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. కాగా నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయి భారీ వరద రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..