AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఎద్దుతో ఆటలు.. కిందపడేసి కుమ్మేసింది.. నెట్టింట వైరలవుతోన్న వీడియో

Bull Attack: జంతువులతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. అప్పుడే అవి కూడా మనతో మంచిగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం మూగజీవాలను తరచూ ఇబ్బందిపెడుతుంటారు. సోషల్‌ మీడియాలో లైకులు, కామెంట్ల కోసమో వాటిని తరచూ ఆటపట్టిస్తుంటారు.

Viral Video: ఎద్దుతో ఆటలు.. కిందపడేసి కుమ్మేసింది.. నెట్టింట వైరలవుతోన్న వీడియో
Bull Attack
Basha Shek
|

Updated on: Aug 31, 2022 | 7:01 PM

Share

Bull Attack: జంతువులతో ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. అప్పుడే అవి కూడా మనతో మంచిగా ఉంటాయి. అయితే కొందరు మాత్రం మూగజీవాలను తరచూ ఇబ్బందిపెడుతుంటారు. సోషల్‌ మీడియాలో లైకులు, కామెంట్ల కోసమో వాటిని తరచూ ఆటపట్టిస్తుంటారు. అవేవీ చేయలేవన్న భావనే దీనికి ప్రధాన కారణం. అయితే ఒక్కోసారి సాధు జంతువులతోనైనా హద్దుమీరి ప్రవరిస్తే ఎదురుదెబ్బలు తప్పవు. తాజాగా ఒక ఎద్దు ఈ మాటను నిజం చేసి చూపించింది. నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోలో ఒక ఎద్దు రోడ్డుపై నిలబడి ఉంది. ఇంతలో ఒక వ్యక్తి దాని వద్దకొచ్చి అవతల ఉన్న జనాలతో ఏదో అంటూ ఎద్దు కొమ్ముల మధ్యలో టచ్ చేశాడు. అంతే, ఆ ఎద్దు ఒక్క ఉదుటున అతన్ని కొమ్ములతో కుమ్మిపారేసింది. అతను కింద పడినా వదల్లేదు. ముఖంపై ఒక్క తన్ను తన్నింది. ఆ వెంటనే అక్కడి నుంచి ఎద్దు పారిపోయింది.

కాగా ఎద్దు దెబ్బలకు సదరు యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. జంతు ప్రేమికుడిగా పేరున్న బ్రిటిష్ కమెడియన్ రిక్కీ గెర్వాయిస్ ఒక వీడియో షేర్ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేవలం ఒక రోజు క్రితం షేర్ చేసిన వీడియోకు గెర్వైస్ ‘బూమ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని ఇప్పటికే ముప్పై లక్షల మందికి పైగా వీక్షించగా, దాదాపు 70 వేల మంది లైక్ చేశారు.’ఈ వీడియో మాకు గుణపాఠం నేర్పుతుంది. జంతువుల హక్కులను మానవులు గౌరవించాలి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..