Viral Video: వధువు కోసం ఆత్రుతగా చూస్తున్న వరుడు.. ఇంతలో భుజంపై చేయి.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..!

Viral Video: వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే అందమైన వేడుక. అందుకే, ఈ వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా..

Viral Video: వధువు కోసం ఆత్రుతగా చూస్తున్న వరుడు.. ఇంతలో భుజంపై చేయి.. కట్ చేస్తే ఫ్యూజులు ఔట్..!
Viral Video
Follow us

|

Updated on: Aug 31, 2022 | 7:11 PM

Viral Video: వివాహం ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకసారి మాత్రమే జరిగే అందమైన వేడుక. అందుకే, ఈ వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుత కాలంలో అయితే, ప్రీ వెడ్డింగ్ షూట్, మెహందీ వేడుక, సంగీత్, రిసెప్షన్ ఇలా రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు.

ఇంతకీ వీడియోలో ఏముందో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ ఫన్నీ వీడియోలో ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతోంది. ఇందులో భాగంగా వరుడు.. వధువు కోసం పడిగాపులు గాస్తున్నాడు. వధువు కూడా అతని వెనుక నుంచి రానే వస్తోంది. ఇంతలో వరుడి స్నేహితుడొకరు.. బ్రైడల్ లెహెంగా ధరించి.. వధువు మాదిరిగా రెడీ అయ్యి వచ్చాడు. వధువును అడ్డగించి, ఆమె బదులుగా అతను వరుడి వద్దకు వెళ్లాడు. అటువైపునకు తిరిగి ఉన్న వరుడి భుజంపై వెనుక నుంచి వధువు వేషంలో ఉన్న స్నేహితుడు చేయి వేశాడు. దాంతో వధువు వచ్చిందని భావించిన వరుడు.. ఆమె వైపునకు ప్రేమగా తిరిగాడు. తీరా చూస్తే తన స్నేహితుడే వధువు వేషంలో దర్శనమిచ్చాడు. దాంతో మొదట షాక్ అయిన వరుడు.. ఆ తరువాత పడి పడి నవ్వుకున్నాడు. అయితే, కొంతకాలంగా దూరంగా ఉన్న ఈ స్నేహితుడు పెళ్లి సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అతని సర్‌ప్రైజ్‌తో పాటు.. చాలాకాలం తరువాత స్నేహితుడు కనిపించడంతో వరుడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. మరెందుకు ఆలస్యం.. మీరూ ఓలుక్కేసుకోండి.

View this post on Instagram

A post shared by hepgul5 ?? (@hepgul5)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..