Viral Video: ఉన్నట్లుండి 5 నెలల కడుపు.. అవాక్కడైన ప్రయాణికుడు.. కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!

Viral Video: ప్రస్తుత కాలంలో చాలా దేశాల్లో మెట్రో సేవలు సర్వసాధారణం అయిపోయాయి. చాలా మంది ప్రయాణికులు, రిస్క్ లేకుండా..

Viral Video: ఉన్నట్లుండి 5 నెలల కడుపు.. అవాక్కడైన ప్రయాణికుడు.. కట్ చేస్తే నవ్వులే నవ్వులు..!
Metro Seat
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 5:51 PM

Viral Video: ప్రస్తుత కాలంలో చాలా దేశాల్లో మెట్రో సేవలు సర్వసాధారణం అయిపోయాయి. చాలా మంది ప్రయాణికులు, రిస్క్ లేకుండా, గమ్య స్థానాన్ని త్వరగా చేరుకునేందుకు మెట్రోలోనే ఎక్కువగా ప్రయాణిస్తున్నారు. పెద్ద నగరాల్లో, ట్రాఫిక్ సమస్యల నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా మంది మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. ఫలితంగా మెట్రోకు రద్దీ విపరీతంగా పెరిగింది. సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సీట్ల కొరత కారణంగా చాలా మంది నిల్చుని ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాం. ఒకవేళ ఎవరైనా గర్భిణీ స్త్రీలు గానీ, బాలింతలు గానీ, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్య బాధితులు గానీ వచ్చినప్పుడు కొందరు సానుభూతితో సీటు ఇవ్వడం కూడా చూస్తాం. అయితే, దీనిని పసిగట్టిన ఓ యువతి.. సీటు కోసం భారీ స్కె్చ్ వేసింది. సీటులో కూర్చున్న వ్యక్తిని పెద్ద బకరా చేసి.. అతన్ని లేపేసింది. అనంతరం తాను హాయిగా కూర్చుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ యువతి మెట్రోలో ప్రయాణిస్తుంది. అయితే, మెట్రోలో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ఇంతలో తనకు ఒక ఐడియా వచ్చింది. సీట్లో కూరచున్న యువకుడి వద్దకు వెళ్లింది. సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీ వస్తే ఎవరైనా సరే కాస్త సానుభూతి చూపి సీటు ఇస్తారు. అదే ప్లాన్ వేసింది అమ్మాయి. అప్పటి వరకు ప్లాట్‌గా ఉన్న కడుపును కాస్తా.. గాలిని పీల్చుకుని ముందుకు నెట్టి ప్రెగ్నెంట్ లేడీగా ఫోజు ఇచ్చింది. అది తెలియని ఆ అమాయకరత్న.. యువతి నిజంగానే ప్రెగ్నెంట్ అనుకుని సానుభూతి చూపాడు. కూర్చున్న సీటు నుంచి లేచి, ఆమెకు సీటు ఇచ్చాడు. తీరిగ్గా సీటులో కూర్చున్న యువతి.. తన పొట్టను ఫ్రీ చేసుకుంది. ఈ ఘటనను అంతా మెట్రోలో ఉన్న కొందరు తమ ఫోన్‌లో రికార్డ్ చేసి.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇదెక్కడ మోసం రా మావా అంటూ షాక్ అవుతున్నారు. పాపం అబ్బాయిని పెద్ద బకరా చేసిందంటూ సానుభూతి తెలుపుతున్నారు. మరికొందరు ఇండియన్ నెటిజన్లు అయితే, ఈ టెక్నిక్ ఇండియాలో రాకూడదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 1.6 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..