ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కమెడియన్‌గా పలు చిత్రాల్లో తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ..
Funny memes on Brahmaji: ప్రముఖ టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కమెడియన్‌గా పలు చిత్రాల్లో తనదైన స్టైల్‌లో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ బ్రహ్మాజీ సరదాగా ఉంటారు. తోటి నటీనటులతో, అభిమానులతో చమత్కారంగా మాట్లాడుతుంటారు. ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వ్యక్తిగత, సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. కాగా తాజాగా ఆయన ట్విటర్ ఖాతాలో తన సెల్ఫీని పోస్టు చేస్తూ ‘వ్వాట్స్ హ్యాపెనింగ్ (ఏం జరుగుతోంది?)’ అంటూ ఓ పోస్టు పెట్టారు. ‘ఏం లేదు అంకుల్..’ అని బ్రహ్మాజీకి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఇక్కడే అసలు రచ్చ మొదలైంది.
సదరు ట్వీట్‌కు హర్ట్ అయిన బ్రహ్మాజీ రీట్వీట్ చేస్తూ.. ‘అంకుల్ ఏంటి? అంకుల్.. కేస్‌వేస్తా! బాడీ షేమింగా..’అంటూ రిప్లై ఇచ్చాడు. బ్రహ్మాజీ ఈ విధంగా అనడంతో ఫన్నీ మీమ్స్, లైకులు, కామెంట్లతో సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో నెట్టింట ఫన్ బాంబ్‌లు తెగ పేలిపోతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేసుకోండి..