Srilakshmi C | Edited By: TV9 Telugu
Updated on: Aug 22, 2024 | 5:01 PM
మన దేశంలో ముఖ్యంగా 5 ప్రముఖ నగరాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. వీటిని చూడటానికి దేశ నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తుంటారు. ఆ ఐదు నగరాలు ఏవంటే..
గణేష్ చతుర్థి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబాయి నగరం.1893లో తొలిసారిగా ముంబైలో ఈ పండుగను జరుపుకున్నారు. ఈ నగరంలో ముంబయిచా రాజా, గణేష్ గల్లి, గణేష్ మండల్, అంధేరిచా రాజా, లాల్‌బాగ్చా రాజా వంటి ప్రసిద్ధ ప్రాంతాలు చాలా ఫేమస్.
దక్షిణ భారతదేశంలో గణేష్ ఉత్సవాలకు పేరుగాంచిన పట్టణం హైదరాబాద్ మహానగరం. హైదరాబాద్‌లో దాదాపు 75,000 గణేశ మంటపాలు కనిపిస్తాయి. బాలాపూర్, చైతన్యపురి, దుర్గం చెరువు, ఖైరతాబాద్, ఓల్డ్ సిటీ, న్యూ నాగోల్‌లలో గణేశ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి.
కర్ణాటకలోని హుబ్లీలో కూడా గణేశోత్సవాలు కోలాహలంగా జరుగుతాయి. గణేశుడి తల్లి పార్వతీ దేవిని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా చాలా మంది మహిళలు ఉపవాసం ఉంటారు.
ఢిల్లీలో జరిగే గణేష్ చతుర్థి ఉత్సవాల్లో సంగీతం, నృత్యం, అందంగా అలంకరించిన మంటపాలు, రుచికరమైన ప్రసాదాలతో అంగరంగ వైభవంగా జరుగుతుంది.
మహారాష్ట్రలోని పూణెలో గణేశోత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. కేసరివాడ గణపతి, కస్బా గణపతి, తంబడి జోగేశ్వరి గణపతి, గురూజీ తాలిమ్ మరియు తులసీ బాగ్ గణపతి..పూణెలోని కొన్ని ప్రసిద్ధ గణపతి మంటపాలివి.