- Telugu News Photo Gallery Viral photos Viral News: Discovered in the deep: the incredible fish with a transparent head
Barreleye Fish: ఆకుపచ్చ కళ్లు, పారదర్శకంగా తల.. చేప లేక గ్రహాంతర వాసా..? షాకవుతున్న శాస్త్రవేత్తలు
బారెలీ అనే చేపను 1939లో కనుగొన్నారు. దీని శరీరం నల్లగా ఉంటుంది, తల పారదర్శకంగా ఉంటుంది. అదే సమయంలో, కళ్ళు ఆకుపచ్చగా ఉంటాయి .. సన్ గ్లాసెస్ లాగా కనిపిస్తాయి. ఈ చేప చీకటిలో కూడా వస్తువులను సులభంగా చూడగలదు.
Updated on: Aug 31, 2022 | 1:13 PM

సముద్ర గర్భంలో ఇలాంటి చేపలు చాలానే ఉన్నాయి, వీటిని ఒక్కసారి చూస్తే.. ‘ఏలియన్’ అనుకుంటారు. సముద్రానికి దాదాపు 600 నుంచి 800 మీటర్ల లోతులో ఓ వింత చేపను చూసి అమెరికా శాస్త్రవేత్తలు సైతం ఉలిక్కిపడ్డారు. నిజానికి, ఈ వింత చేప తల పారదర్శకంగా ఉంది. కళ్ళు ఆకుపచ్చగా ఉన్నాయి. లోతైన సముద్రంలో నివసించే ఈ జీవిని 'బారెల్లీ ఫిష్' లేదా స్పూకీ ఫిష్ అని కూడా పిలుస్తారు. 83 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ చేపను చూశారు

కాలిఫోర్నియాలోని మోంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని జీవశాస్త్రవేత్త బ్రూస్ రాబిసన్ ఈ చేపను 1939లో కనుగొన్నారు. దాని శరీరంలోని మిగిలిన భాగం ఎక్కువగా నల్లగా ఉంది, తల పారదర్శకంగా ఉంది. అదే సమయంలో చేపల ఆకుపచ్చ రంగులో ఆకుపచ్చ కళ్ళు సన్ గ్లాసెస్ లాగా కనిపిస్తాయి. అందుకనే ఈ చేప చీకటిలో కూడా వస్తువులను సులభంగా చూడగలదు.

బారెలీ చేపల వింత కళ్ళు సముద్రంలో ఎరను కనుగొనడంలో సహాయపడతాయి. ఈ చేప సాధారణంగా చిన్న కీటకాలను వేటాడుతుంది. పరిశోధనా సంస్థ కనుగొన్న బరేలీ చేప పొడవు 15 సెంటీమీటర్లు.

సముద్రపు లోతుల్లో బరేలీ చేపలను సులభంగా చూడలేమని బ్రూస్ రాబిసన్ చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో 15 సెంటీమీటర్ల పొడవున్న ఈ చేపలను కేవలం 8 సార్లు మాత్రమే సజీవంగా చూశానని చెప్పాడు. చాలా అరుదైన ఘటన అని ఖచ్చితంగా చెప్పగలను అని బ్రూస్ రాబిసన్ చెప్పాడు.

బ్రూస్ రాబిసన్ ప్రకారం బారెలీ చేప కళ్ళు స్థిరంగా ఉన్నాయని మొదట అనుకున్నారు. అయితే మూడేళ్ల క్రితం నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ చేప కళ్ళు అసాధారణమని.. పారదర్శక తలలో తిరుగుతాయని తేలినట్లు చెప్పారు.
