AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సముద్రంలో ఏలియన్ చేప.. శాస్త్రవేత్తలు సైతం పరేషాన్.. మీరూ చూసేయండి..

Viral: సముద్రగర్భంలో లెక్కలేనన్ని జలచరాలు నివస్తున్నాయి. వీటిలో సమాజానికి తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియని, వింత జాతులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తాజాగా ఒక వింత చేప వెలుగు చూసింది.

Shiva Prajapati
|

Updated on: Aug 31, 2022 | 4:53 PM

Share
Viral: సముద్రగర్భంలో లెక్కలేనన్ని జలచరాలు నివస్తున్నాయి. వీటిలో సమాజానికి తెలిసినవి కొన్ని మాత్రమే. తెలియని, వింత జాతులు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో తాజాగా ఒక వింత చేప వెలుగు చూసింది. దానిని ఒక్కసారిగా చూస్తే ‘ఏలియన్’ అనిపించక మానదు. సముద్రానికి 600 నుంచి 800 మీటర్ల లోతులో ఈ వింత చేపను చూసి అమెరికా శాస్త్రవేత్తలు సైతం ఉలిక్కిపడ్డారు. ఈ వింత  చేప తల విచిత్రంగా క్రిస్టల్ మాదిరిగా ఉండి.. దాని కళ్లు పూర్తి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. లోతైన సముద్రంలో నివసించే ఈ జీవిని ‘బారెల్లీ ఫిష్’ , స్పూకీ ఫిష్ అని కూడా పిలుస్తారు. 83 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ చేపను చూశారు.

1 / 5
కాలిఫోర్నియాలోని మోంటెరీ బే అక్వేరియం రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని జీవశాస్త్రవేత్త బ్రూస్ రాబిసన్, ఈ చేపను 1939లో కనుగొన్నారు. దాని శరీరంలోని మిగిలిన భాగం ఎక్కువగా నల్లగా ఉంటుంది. తల బాగం క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది. అదే సమయంలో, చేప కళ్లు ఆకుపచ్చగా ఉన్నాయి. దీని కారణంగా ఈ చేప చీకటిలో కూడా వస్తువులను సులభంగా చూడగలదు.

2 / 5
బారెలీ చేపల వింత కళ్ళు సముద్రంలో ఎరను కనుగొనడంలో సహాయపడతాయి. ఈ చేప సాధారణంగా చిన్న కీటకాలను వేటాడుతుంది. పరిశోధనా సంస్థ కనుగొన్న బరేలీ చేప పొడవు 15 సెంటీమీటర్లు.

3 / 5
సముద్రపు లోతుల్లో బరేలీ చేపలను అంత ఈజీగా కనుగొనలేరని బ్రూస్ రాబిసన్ చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్‌లో 15 సెంటీమీటర్ల పొడవున్న ఈ చేపలను కేవలం 8 సార్లు మాత్రమే సజీవంగా చూశానని చెప్పాడు. అవి చాలా అరుదు అని ఆయన పేర్కొన్నారు.

4 / 5
బ్రూస్ రాబిసన్ ప్రకారం.. బారెలీ చేప కళ్ళు స్థిరంగా ఉన్నాయని మొదట అందరూ విశ్వసించారు. అయితే, మూడేళ్ల క్రితం నిర్వహించిన ఒక అధ్యయనంలో దాని అసాధారణ కళ్ళు పారదర్శకమైన తలలో తిరుగుతాయని తేలింది.

5 / 5
Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..

నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?

తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..

తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే

ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు

స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్

'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే

డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి