NPS Trust Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో గ్రేడ్‌ ‘ఏ, బి’ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS Trust).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రేడ్‌ 'ఏ' (అసిస్టెంట్‌ మేనేజర్‌), గ్రేడ్‌ 'బి' (మేనేజర్‌) పోస్టుల (Grade A and B Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

NPS Trust Recruitment 2022: నెలకు రూ.90 వేల జీతంతో నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌లో గ్రేడ్‌ 'ఏ, బి' ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
Nps Trust
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:04 PM

NPS Trust Grade A and B Recruitment 2022: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (NPS Trust).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన గ్రేడ్‌ ‘ఏ’ (అసిస్టెంట్‌ మేనేజర్‌), గ్రేడ్‌ ‘బి’ (మేనేజర్‌) పోస్టుల (Grade A and B Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మీడియా మార్కెటింగ్‌ అండ్‌ సబ్‌స్క్రైబర్ ఎడ్యుకేషన్‌, రాజ్‌భాష, ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌, ఐటీ అండ్‌ లీగల్‌ తదితర స్ట్రీముల్లో దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టనుంది. పోస్టును బట్టి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌/మార్కెటింగ్/డిజిటల్ మార్కెటింగ్/పబ్లిక్ రిలేషన్స్/మాస్ కమ్యూనికేషన్/విజువల్ కమ్యూనికేషన్‌లో స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఎంబీఏ, ఫైనాన్స్/అసోసియేట్ చార్టర్డ్ అకౌంటెంట్ (ACA) లేదా ఫెలో చార్టర్డ్ అకౌంటెంట్ (FCA), బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంగ్లీష్‌, హిందీ/సంస్కృతం సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు సెప్టెంబర్‌ 20, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులకు రూ.1000లు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు గ్రేడ్‌ ఏ పోస్టులకు రూ.89,150లు, గ్రేడ్‌ బి పోస్టులకు రూ.99,750ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • మీడియా మార్కెటింగ్ & సబ్‌స్క్రైబర్ ఎడ్యుకేషన్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 1
  • రాజభాషలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 1
  • పెట్టుబడి మరియు పరిశోధనలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్టులు: 1
  • మేనేజర్ మీడియా మార్కెటింగ్ & సబ్‌స్క్రైబర్ ఎడ్యుకేషన్ పోస్టులు: 1
  • మేనేజర్ ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్‌ పోస్టులు: 1

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన..
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..