TS Constable Key 2022: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్ ఎగ్జామ్ ‘కీ’ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు..

TS Constable Key 2022: తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుల్ ఎగ్జామ్ 'కీ' విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
Ts Constable Key
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 30, 2022 | 7:55 PM

TS Police Constable Answer Key 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఆగస్టు 28న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 6,03,955 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఐతే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు తన అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు ఆన్సర్‌ ‘కీ’ని చెక్‌ చేసుకుని ఏవైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్‌ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో అభ్యంతరాలు లేవనెత్తడానికి బోర్డు అవకాశం కల్పించింది. అభ్యంతరాలు రేపట్నుంచి సమర్పించవచ్చు. ప్రైమరీ ఆన్సర్‌ కీపై లేవనెత్తిన అభ్యంతరానలు పరిగణనలోకి తీసుకుని ఫైనల్ ఆన్సర్‌ కీని తయారు చేస్తారు. అనంతరం తుది ఫలితాలతోపాటు ఫైనల్‌ ఆన్సర్‌ కీని కూడా విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) వెల్లడించింది. కాగా 15,644 సివిల్‌ పోస్టులతోపాటు, 63 ట్రాన్స్‌పోర్ట్‌, 614 కానిస్టేబుల్‌ పోస్టులకు ఈ యేడాది ఏప్రిల్‌ 28న వేర్వేరుగా విడుదలైన నోటిఫికేషన్లను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఉమ్మడిగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 6,61,198 మంది దరఖాస్తు చేసుకోగా.. 6,03,955 మంది హాజరయ్యారు. దాదాపు 91.34శాతం మంది పరీక్ష రాశారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.