ICMR-NCDIR Jobs 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.72 వేల జీతంతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

భార‌త ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ - నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ (ICMR-NCDIR).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న 28 ప్రాజెక్టు సైంటిస్ట్‌, రిసెర్చ్ అసోసియేట్‌ తదితర పోస్టుల (Project Scientist Posts) భర్తీకి..

ICMR-NCDIR Jobs 2022: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో నెలకు రూ.72 వేల జీతంతో ప్రాజెక్ట్ స్టాఫ్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
ICMR-NCDIR Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 15, 2022 | 6:23 AM

ICMR-NCDIR Project Staff Recruitment 2022: భార‌త ప్రభుత్వ సంస్థ అయిన బెంగళూరులోని ఐసీఎంఆర్ – నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్‌ ఇన్‌ఫ‌ర్మాటిక్స్ అండ్ రిసెర్చ్ (ICMR-NCDIR).. ఒప్పంద ప్రాతిప‌దిక‌న 28 ప్రాజెక్టు సైంటిస్ట్‌, రిసెర్చ్ అసోసియేట్‌, కంప్యూట‌ర్ ప్రోగ్రామర్, ప్రాజెక్టు టెక్నిక‌ల్ ఆఫీస‌ర్, ప్రాజెక్టు సీనియ‌ర్‌, అడ్మిన్ అసిస్టెంట్‌ తదితర పోస్టుల (Project Scientist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్/డిగ్రీ/ఎంబీబీఎస్‌/బీఈ/బీటెక్/ఎండీ/ఎంఎస్‌/ పీజీ డిగ్రీ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 25 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా సెప్టెంబర్‌ 12, 2022వ తేదీలోపు adm.ncdir@gov.in ఈమెయిల్ ఐడీకి దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అర్హతలను బట్టి షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచినవారికి నెలకు రూ.17,000ల నుంచి రూ.72,325ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.