AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda Jobs 2022: రాత పరీక్షలేకుండానే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే నేరుగా..

భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. 20 బిజినెస్‌ కరెస్పాండెంట్‌ సూపర్‌వైజర్ పోస్టుల (Business Correspondent Supervisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

Bank of Baroda Jobs 2022: రాత పరీక్షలేకుండానే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు పొందే అవకాశం.. ఈ అర్హతలుంటే నేరుగా..
Bank Of Baroda
Srilakshmi C
|

Updated on: Aug 30, 2022 | 3:46 PM

Share

Bank of Baroda Business Correspondent Supervisor Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank Of Baroda).. 20 బిజినెస్‌ కరెస్పాండెంట్‌ సూపర్‌వైజర్ పోస్టుల (Business Correspondent Supervisor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే పలు బ్యాంకుల్లో చీఫ్‌ మేనేజర్‌ కేడర్‌లో పనిచేసినవారు, అలాగే రిటైర్డ్‌ క్లర్క్‌, ఎమ్మెస్సీ/బీఈ/ఎంసీఏ/ఎంబీఏ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి. ఇంగ్లిష్, హిందీ ల్యాంగ్వేజ్‌లలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 21 నుంచి 65 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్త కలిగిన వారు సెప్టెంబర్‌ 19, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలేకుండానే నేరుగా ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.12,000ల నుంచి 15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Bank of Baroda, Regional Office, Bareilly District Region 35A/8 , Rampur Garden, Opposite Prabha Talkies, Bareilly, Uttar Pradesh, 243001.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.