బ్రేకప్ తర్వాత కూడా మాజీ ప్రియుడితో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వార్తలు తరచూ నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..
Sushmita Sen Spotted With her Ex-Boyfriend: బ్రేకప్ తర్వాత కూడా మాజీ ప్రియుడితో మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వార్తలు తరచూ నెట్టింట హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న (ఆదివారం) ముంబాయ్‌లో మాజీ బాయ్ ఫ్రెండ్ రోహ్మాన్ షాల్, కూతురు రెనీ సేన్‌తో కలిసున్న ఫొటోలు నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్‌తో 2018లో డేటింగ్ ప్రారంభించిన సుస్మితా సేన్ గత యేడాది విడిపోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు ద్వారా తెలియజేసింది. తమ సుదీర్ఘ రిలేషన్‌షిప్ ముగిసిందని, ఇకపై స్నేహితులుగా ఉండబోతున్నట్లు సుస్మితా సేన్ తన పోస్టులో వెల్లడించింది. ఆ తర్వాత గత జులైలో భారత మెగా టీ20 క్రికెట్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రకటించింది. లలిత్-సుస్మితా సేన్‌లకు సంబంధించిన ఫొటోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి.
‘బెటర్ హాఫ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో లలిత్ మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేశాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోకపోవడంతో తాను పెట్టిన పోస్టుకు తర్వాత ఎడిట్ చేసి తమ రిలేషన్‌షిప్‌పై లలిత్ మోదీ క్లారిటీ ఇచ్చాడు.
కాగా ఆదివారం (ఆగస్టు 29) సుస్మితా సేన్ తన చిన్న కూతురు అలీసా 13వ బర్త్‌డే వేడుకలు నిర్వహించింది. కుమార్తె ఫొటోలను షేర్ చేస్తూ.. ‘లవ్ ఆఫ్ మై లైఫ్‌కు 13వ పుట్టిన రోజు శుభాకాంక్షలు! అలీసా అంటే గొప్పవారు, దేవుడి చేత రక్షింపబడేవారు, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం. అలీసాకు తల్లిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను’ అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాసుకొచ్చింది. ఆర్య అనే వెబ్ సిరీస్‌లో చివరిగా కనిపించిన సుస్మితా సేన్.. రెనీ, అలీసా అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. పెద్ద కుమార్తె రెనీ గత ఏడాది సుట్టబాజీ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది కూడా.