Karthikeya 2: నిఖిల్ కార్తికేయ2 పై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటూ…

కుర్ర హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

Karthikeya 2: నిఖిల్ కార్తికేయ2 పై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలంటూ...
Karthikeya 2
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:20 PM

Karthikeya 2: కుర్ర హీరో నిఖిల్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. గతంలో నిఖిల్ నటించిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా మంచి హిట్ ను సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కించారు దర్శకుడు చందు. ఈ సినిమా పై సినిమా తారలతో పాటు పలువురు ప్రముఖులు కూడా సైతం ఈ సినిమా పై చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా   గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఆయన కొనియాడారు. చిత్ర హీరో నిఖిల్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ ను భూపేంద్ర భాయ్ పటేల్ ప్రత్యేకంగా కలిశారు. ఇలాంటి మంచి సినిమాలు దేవుళ్ళ గొప్పతనాన్ని తెలిపే సినిమాలు మరిన్ని రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కార్తికేయ 2 సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది. చిన్న సినిమా గా వచ్చి 100 కోట్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది కార్తికేయ 2. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ ప్రశంసించడంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Gujarat Cm

Gujarat Cm

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

ఇవి కూడా చదవండి