Brahmastra Part One – Shiva: ఆ వీడియోల వల్లే.. ‘బ్రహ్మస్త్ర’ కు ఇలాంటి పరిస్థితి..

నిజానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ అప్పట్లో నిరూత్సాహపడ్డారు..

Brahmastra Part One - Shiva: ఆ వీడియోల వల్లే.. ‘బ్రహ్మస్త్ర’ కు ఇలాంటి పరిస్థితి..
Brahmastra New
Follow us
Venkata Chari

|

Updated on: Aug 29, 2022 | 8:00 PM

Brahmastra: రణ్‌బీర్‌ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ సినిమాలో అలియాభట్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. నిజానికి ఇది బాలీవుడ్‌ చిత్రమే అయినా ఇందులో కింగ్‌ నాగార్జున కూడా నటిస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టి పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి.

నిజానికి ఈ సినిమా చాలా రోజుల క్రితమే ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్‌డేట్‌ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్‌ అప్పట్లో నిరూత్సాహపడ్డారు. అయితే వారి నిరుత్సాహాన్ని దూరం చేస్తూ… ఈ సినిమా నుంచి చాలా అప్టేడ్స్ ఇచ్చారు మేకర్స్. అప్డేట్స్ ఇవ్వడమే కాదు.. ఇటీవల బ్రహ్మస్త్రలోని అన్ని అస్త్రాలను వివరిస్తూ.. వీడియోలను కూడా రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడా వీడియోలే.. సినిమాపై విపరీతంగా అంచానలను పెంచేశాయి. అంచనాలను పెంచడమే కాదు.. సినిమా స్టోరీపై.. డైరెక్టర్ విజన్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేలా చేశాయి.