Nandamuri Balakrishna: బాలయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు.. కారణం ఏంటంటే?
తాజాగా స్టార్ హీరో బాలకృష్ణకు సుప్రీం నోటీసులివ్వడం తెలుగు టూ స్టేట్స్ లో సంచలనంగా మారింది. బాలయ్యతో పాటు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా సుప్రీం నుంచి నోటీసులందడం..
Nandamuri Balakrishna: తాజాగా స్టార్ హీరో బాలకృష్ణకు సుప్రీం నోటీసులివ్వడం తెలుగు టూ స్టేట్స్ లో సంచలనంగా మారింది. బాలయ్యతో పాటు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా సుప్రీం నుంచి నోటీసులందడం.. ప్రస్తుతం అంతటా చర్చనీయాంశం అవుతోంది. అయితే ఈ నోటీలకు.. గతంలో గౌతమ పుత్ర శాతకర్ణి సినిమాకు ఇచ్చిన పన్ను మినహాయింపులే కారణమనే విషయం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
ఎస్ ! 2017లో రిలీజైన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా.. అప్పటి ప్రభుత్వాల నుంచి పన్ను రాయితీని పొందింది. కాని ఆ రాయితీని ప్రేక్షకులకు బదాలాయించకుండా తన జేబులో వేసుకుంది. ఇక దీనిపైనే సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. పన్ను రాయితీగా పొందిన సొమ్మును తిరిగి ప్రభుత్వం రికవరీ చేయాలని ఆ పిటిషన్ లో విజ్ఞప్తి చేసింది. ఇక దీన్ని విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. వై.చంద్ర చూడ్ ధర్మాసనం తాజాగా ఈ సినిమాలో నటించిన హీరో బాలయ్యకు నోటిలిచ్చింది.