Ravi Teja: మాస్ రాజా సినిమా కోసం మాస్టర్ ప్లాన్.. ఆ సీన్స్ కోసం ఏకంగా 5 కోట్లతో భారీ సెట్
మాస్ మహారాజ రవితేజ కు అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిందే.. ఇప్పటికే క్రాక్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) అర్జెంట్ గా హిట్ కొట్టాల్సిందే..ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకునే కోరిక. ఇప్పటికే క్రాక్ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన క్రాక్ సినిమాలో రవితేజ పోలీస్ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఖిలాడి అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అలాగే రీసెంట్ గా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాస్ రాజా. ఈ సినిమా కూడా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఇప్పుడు అర్జెంట్ గా రవితేజ హిట్టు కొట్టాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో ‘రావణాసుర’ ఒకటి
క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిసింది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను నిర్మించనున్నారట. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం 5 కోట్లతో ఓ భారీ సెట్ ను నిర్మించనున్నారట. ఈ సెట్ లో రావణాసుర మూవీ క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే అను ఇమ్మాన్యుయేల్ – మేఘా ఆకాష్ – ఫరియా అబ్దుల్లా – దక్షా నగర్కర్ – పూజిత పొన్నాడ వంటి ఐదుగురు హీరోయిన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి