Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో ఆ హీరో కూడా.. దాదాపు కన్ఫామ్ అంటున్నారే..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్నది ఇప్పుడు..

Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో ఆ హీరో కూడా.. దాదాపు కన్ఫామ్ అంటున్నారే..!!
Mahesh Babu
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 30, 2022 | 8:18 PM

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మహేష్ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహేష్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నవిషయం తెల్సిందే. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. గతంలో ఈ ఇద్దరు కలిసి అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇద్దరు కలిసి మ్యాజిక్ చేయడనికి రెడీ అవుతున్నారు. మహేష్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఇప్పటికే లీక్ అవుతున్న ఫోటోస్ అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో హీరో కూడా నటించనున్నాడని అంటున్నారు. మహేష్ తో ఈ మూవీలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ కూడా కనిపించనున్నారట. ఈ సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వు సినిమాలో తరుణ్ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమాతో మరోసారి తరుణ్ ను డైరెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ కెరీర్ లో 28వ సినిమా గా వస్తున్న ఇందులో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది.

Tharun

Tharun

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి