AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: కోబ్రా విడుదలకు ముందు హైకోర్టు కీలక నిర్ణయం.. ఆ వెబ్‏సైట్లపై నిషేధం.. ఎందుకంటే..

భారీ బడ్జెట్‏తో కొన్నేళ్లుగా ఎన్నో అంచనాల మధ్య రూపొందించిన సినిమాను పైరసీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని... పలు ప్రైవేట్ వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోబ్రా చిత్ర నిర్మాణ సంస్థ సెవన్ స్క్రీన్ స్టూడియోకు

Vikram: కోబ్రా విడుదలకు ముందు హైకోర్టు కీలక నిర్ణయం.. ఆ వెబ్‏సైట్లపై నిషేధం.. ఎందుకంటే..
Cobra
Rajitha Chanti
| Edited By: |

Updated on: Aug 30, 2022 | 8:19 PM

Share

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటిస్తోన్న కోబ్రా చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా మద్రాసు హైకోర్టు పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టింది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. భారీ బడ్జెట్‏తో కొన్నేళ్లుగా ఎన్నో అంచనాల మధ్య రూపొందించిన సినిమాను పైరసీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని… పలు ప్రైవేట్ వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోబ్రా చిత్ర నిర్మాణ సంస్థ సెవన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన నిర్మాత లలిత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్ పై న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమంక్షయంలో సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. చట్టవిరుద్ధంగా సినిమా ప్రదర్శించకుండా నిరొందించడానికి 1,788 పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాతలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి.. ఎదురైన ప్రతి అడ్డంకులను ఎదుర్కొని సినిమా విడుదల చేస్తుంటే.. పలు వెబ్ సైట్స్ మాత్రం పైరసీ చేస్తున్నాయని.. దీంతో ప్రొడ్యూసర్లకు భారీగా నష్టం ఏర్పడుతుందని.. అంతేకాకుండా ఎంతో మంది సినీ కార్మికుల జీవితాలు నాశం అవుతున్నాయని పిటిషన్ లో పేర్కోన్నారు. ఎన్నో నెలలు కష్టపడి తెరకెక్కించిన కోబ్రా చిత్రాన్ని పైరసీ చేయకుండా పలు వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అనంతరం పైరసీకి పాల్పడుతున్న వెబ్ సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశించారు. వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఉత్తర్వులను జారీ చేశారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో విక్రమ్ గణిత శాస్త్రవేత్తగా కనిపించనున్నాడు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్