TIFR Recruitment 2022: ఐటీఐ అర్హతతో టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా..
ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR).. 9 ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టుల (Tradesman Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
TIFR Tradesman Trainee Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR).. 9 ట్రేడ్స్‌మెన్ ట్రైనీ పోస్టుల (Tradesman Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐలో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే జులై 1, 2022వ తేదీనాటికి అభ్యర్ధుల వయసు 28 యేళ్లకు మించకుండా వయసుండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 15, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.12,500ల వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. ముంబయిలోని టీఐఎప్‌ఆర్‌లో ట్రేడ్స్‌మెన్ ట్రైనీగా పనిచేయవల్సి ఉంటుంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.