SSMB 28: మహేశ్‌ సినిమాలో తరుణ్‌.. రీ ఎంట్రీపై హీరో రియాక్షన్‌ ఏంటంటే?

Tarun: అతడు, ఖలేజా వంటి హిట్‌ సినిమాల తర్వాత మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. SSMB 28 (వర్కింగ్‌ టైటిట్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

SSMB 28: మహేశ్‌ సినిమాలో తరుణ్‌.. రీ ఎంట్రీపై హీరో రియాక్షన్‌ ఏంటంటే?
Mahesh Babu Tarun
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:08 PM

Tarun: అతడు, ఖలేజా వంటి హిట్‌ సినిమాల తర్వాత మహేశ్‌ బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. SSMB 28 (వర్కింగ్‌ టైటిట్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలోనే పూజా కార్యక్రమాలు జరుపుకొన్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం లవర్‌బాయ్ తరుణ్‌ను కలిశారని, పాత్ర నచ్చడంతో ఆయన కూడా వెంటనే అంగీకరించారని జోరుగా ప్రచారం సాగింది. సోషల్‌ మీడియాలో కూడా దీనిపైనే చర్చ సాగుతోంది. తాజాగా ఈ వార్తలపై తరుణ్‌ స్పందించాడు.

మహేశ్‌ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు తరుణ్‌. సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలను నమ్మోద్దని సూచించారు. తన జీవితంలో ఏం జరిగినా తానే స్వయంగా అభిమానులతో పంచుకుంటానని స్పష్టం చేశారు. కాగా నువ్వేకావాలి, ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే.. ఇలా వరుస ప్రేమకథల్లో నటించి లవర్‌బాయ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్‌. అయితే తన సక్సెస్‌ ట్రాక్‌ను కొనసాగించడంలో విఫలయ్యాడు. 2018లో ‘ఇది నా లవ్‌స్టోరీ’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించాడీ హీరో.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి