Chiranjeevi: మా నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్‌

First Day First Show Pre Release event: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బషులను పరిచయం చేస్తూ పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మించిన చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న దర్శకుడు అనుదీప్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు.

Chiranjeevi: మా నాన్న రోడ్డుపై పరుగెత్తించి కొట్టారు.. ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్‌
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Sep 01, 2022 | 8:04 AM

First Day First Show Pre Release event: నూతన హీరో, హీరోయిన్లు శ్రీకాంత్‌ రెడ్డి, సంచిత బషులను పరిచయం చేస్తూ పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మించిన చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న దర్శకుడు అనుదీప్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా ఘన విజయం సాధించాలని చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కాగా తన ప్రసంగంలో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు చిరు. తన ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవమెలా ఉంటుందో చెప్పి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు.

నేల టికెట్టుకు వెళ్లామని.. ‘నాకు కూడా ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవం ఉంది. అయితే ఎప్పుడూ.. ఎక్కడా చెప్పుకోలేదు. ఎందుకంటే పరువు పోతుందేమో అని (నవ్వుతూ). నెల్లూరులో.. సంవత్సరం గుర్తు లేదు కానీ నేనప్పుడు ఏడో, ఎనిమిదో తరగతి చదువుకుంటున్నాను. సినిమా పేరు ఏవీఎమ్ వారి రాము. దివంగత నందమూరి తారక రామారావుగారు నటించిన సినిమా అది. పూర్ణ అని మా చుట్టాలలో ఒకబ్బాయి ఉండేవాడు. వాడికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడితో ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాం. నాన్నగారు మమ్మల్ని నేల, బెంచ్ కాకపోయినా.. కాస్త కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేలకు వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు తమ్ముడు నాగబాబు కూడా సినిమాకు వచ్చాడు. విపరతీమైన రద్దీ కారణంగా ఆ సినిమాకి టికెట్లు తీసుకొనే క్రమంలో మా నాగబాబు బాగా నలిగిపోయాడు. ఊపిరి ఆగిపోయేంత పనైపోయింది. బిక్క ముఖం పెట్టేశాడు. అదే సమయంలో మా నాన్న అంతకుముందు షో చూసి వస్తున్నారు. అమ్మ కూడా ఉంది. మా పరిస్థితి చూసి.. ఆయన కోపంతో అక్కడ మొదలెట్టి.. ఇంటికి వచ్చేవరకు కొడుతూనే ఉన్నారు. అందుకే ఇప్పటికీ ఏవీఎమ్ రాము సినిమా అంటే నాకు షివరింగ్ వచ్చేస్తుంది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..