Viral Video: సూర్య సుడిగాలి ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఫిదా.. ఏం చేశాడో తెలుసా? ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న వీడియో

India vs Hong Kong, Asia Cup 2022:  ఆసియాకప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్‌-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత ఇన్నింగ్స్ లో సూర్య టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Viral Video: సూర్య సుడిగాలి ఇన్నింగ్స్‌కు కోహ్లీ ఫిదా.. ఏం చేశాడో తెలుసా? ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోన్న వీడియో
Suryakumar Virat Kohli
Follow us
Basha Shek

|

Updated on: Sep 01, 2022 | 8:35 AM

India vs Hong Kong, Asia Cup 2022:  ఆసియాకప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా సూపర్‌-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. భారత ఇన్నింగ్స్ లో సూర్య టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతను కేవలం 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు. కాగా సూర్యకుమార్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌కు మరో ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం బౌండరీ వద్దకు వెళ్లిన విరాట్‌.. సూర్యకుమార్‌ దగ్గరకు రాగానే ‘టేక్‌ ఏ బౌ’ అంటూ ప్రశంసించాడు. దీంతో సూర్య కోహ్లీని హగ్‌ చేసుకున్నాడు. అనంతరం చప్పట్లు కొట్టి సూర్యను అభినందించాలంటూ గ్యాలరీలోని ప్రేక్షకులను కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

కాగా ఈ మ్యాచ్ లో సూర్యతో పాటు విరాట్ కూడా రాణించాడు. సుమారు ఆరు నెలల తర్వాత ఓ మ్యాచ్ లో అతను అర్ధ సెంచరీ సాధించాడు. మొత్తం 44 బంతులు ఆడిన విరాట్‌ 3 సిక్సర్లు, ఒక బౌండరీ సహాయంతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 31వ హాఫ్ సెంచరీ. వీరిద్దిరు మూడో వికెట్‌కు వేగంగా 98 పరుగుల చేయడంతో టీమిండియా మొదట 192 పరుగుల భారీస్కోరు సాధించింది. ఆతర్వాత హాంకాంగ్‌ 152 పరుగులకే పరిమితమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..