Viral Video: కొంచెం చూసుకోవాలి కదా బ్రో.. అక్కడున్నది జడ్డూ మరి.. రాకెట్ త్రోకు బలైన హాంకాంగ్ కెప్టెన్
India vs Hong Kong, Asia Cup 2022: దుబాయి వేదికగా జరుగుతోన్న ఆసియాకప్‌లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. బుధవారం హాంకాంగ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్-4 రౌండ్‌కు దూసుకెళ్లింది.
India vs Hong Kong, Asia Cup 2022: దుబాయి వేదికగా జరుగుతోన్న ఆసియాకప్‌లో టీమిండియా జోరు కొనసాగిస్తోంది. బుధవారం హాంకాంగ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత జట్టు 40 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా సూపర్-4 రౌండ్‌కు దూసుకెళ్లింది. సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లి(59 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మెరుపు త్రో మెరిశాడు. హాంకాంగ్ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్‌లో ఆర్ష్‌దీప్ సింగ్ సింగ్ ఐదో బంతిని నో బాల్‌గా వేశాడు. దీంతో ప్రత్యర్థికి ఫ్రీ హిట్ లభించింది. అయితే ఈ ఫ్రీ హిట్‌ను హాంకాంగ్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. పైగా కీలక వికెట్‌ను కూడా కోల్పోయింది. ఈ బంతిని ఎదుర్కొన్న హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు.
అయితే నిజాకత్ సింగిల్ తీయడానికి ప్రయత్నించి ముందుకు వెళ్లగా.. నాన్ స్ట్రైక్‌లో ఉన్న బాబర్ హయత్ తిరస్కరించాడు. దీంతో తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా మెరుపు త్రో తో వికెట్లను గిరాటేశాడు. దీంతో నిజాకత్ ఖాన్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తూ.. ‘కొంచెం చూసి వెళ్లాలి కదా బ్రో.. అక్కడ ఉన్నది జడేజా మరీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.