Viral: అక్కడి జనం కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. కట్ చేస్తే అమాంతం పెరిగిన సేల్స్!

ఓ ప్రాంతంలో కండోమ్స్ వాడకం ఎక్కువైపోయిందట. గతేడాది కంటే.. ఈ సంవత్సరం వాటి సేల్స్ అమోఘంగా పెరిగాయట.

Viral: అక్కడి జనం కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. కట్ చేస్తే అమాంతం పెరిగిన సేల్స్!
Condoms
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 02, 2022 | 9:29 PM

ఓ ప్రాంతంలో కండోమ్స్ వాడకం ఎక్కువైపోయిందట. గతేడాది కంటే.. ఈ సంవత్సరం వాటి సేల్స్ అమోఘంగా పెరిగాయట. ఇది మేము చెప్పట్లేదండి.. ‘స్విగ్గీ ఇన్‌స్టా‌మార్ట్‌’‌ వెల్లడించింది. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటని అనుకుంటున్నారా.! అదే మన ఆర్ధిక రాజధాని ముంబై. ‘స్విగ్గీ ఇన్‌స్టా‌మార్ట్‌’‌లో ముంబై కస్టమర్స్ ఈ ఏడాది ఆర్డర్ చేసిన కండోమ్స్ సంఖ్య మునపటి ఏడాది కంటే 570 రెట్లు ఎక్కువట. మిగిలిన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే.. ముంబైలోని జనం కండోమ్స్‌ను ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారట.

అటు బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాల్లో చాలామంది గుడ్లు, కండోమ్‌లు, శానిటరీ నాప్‌కిన్‌లు, టాంపాన్‌లు, తాజా జ్యూస్‌లు, ఇన్‌స్టంట్ న్యూడిల్స్‌ లాంటివి గతేడాది సుమారు 2 మిలియన్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. కాగా, ఇటీవలకాలంలో స్విగ్గీ.. సరికొత్తగా ‘స్విగ్గీ ఇన్‌స్టా‌మార్ట్‌’‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే.. ఈ యాప్‌కు సంవత్సర కాలంలో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందట.(Source)