T20 World Cup: భారతజట్టుకు గట్టి ఎదురుదెబ్బ.. టీ20 వరల్ట్‌కప్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం!
Ravindra Jadeja: ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలన్న ఆశతో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతోన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Ravindra Jadeja: ఈసారి ఎలాగైనా టీ20 ప్రపంచకప్ గెలవాలన్న ఆశతో ఉన్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతోన్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పొట్టి ప్రపంచకప్‌కు కూడా దూరం కానున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మోకాలి గాయంతో ఇప్పటికే ఆసియా కప్ నుంచి తప్పుకున్న జడ్డూ వరల్డ్‌కప్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. అతని మోకాలి గాయం తీవ్రంగా ఉందని, శస్త్రచికిత్స తర్వాత కనీసం 3 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని, అందుకే అతను ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. జడేజా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామంటున్నాయి.
కాగా ఆసియాకప్ టోర్నీలో భాగంగా పాక్, హాంకాంగ్‌లపై టీమిండియా ఘన విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక హాంకాంగ్‌పై 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. కాగా ఫార్మాట్ ఏదైనా గత కొన్నేళ్లుగా అటు బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు జడేజా. అలాంటిది అతను ప్రపంచకప్‌నకు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..