Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chinmayi: సామ్‌తో నా జర్నీ ముగిసిందనుకుంటున్నా.. ఇక ఆ ఛాన్స్‌ లేనట్టే.. చిన్మయి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Chinmayi- Samantha: చిన్మయి మీటూ ఆరోపణలు చేసినప్పుడు సామ్‌ బహిరంగంగా తన స్నేహితురాలికి మద్దతు పలికింది. అలాగే ఫ్యామిలీ మేన్‌ -2 వెబ్‌ సిరీస్ విషయంలో సామ్‌ని పలువురు విమర్శించినప్పుడు ఈ స్టార్ సింగర్‌ సమంతకు సపోర్టుగా నిలబడింది.

Chinmayi: సామ్‌తో నా జర్నీ ముగిసిందనుకుంటున్నా.. ఇక ఆ ఛాన్స్‌ లేనట్టే.. చిన్మయి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్
Chinmayi Samantha
Follow us
Basha Shek

|

Updated on: Sep 03, 2022 | 8:43 PM

Chinmayi- Samantha: ఏమాయ చేసావే అంటూ టాలీవుడ్‌కు పరిచయమైంది సమంత (Samantha). ఈసినిమాలో సామ్‌ పోషించిన జెస్సీ పాత్రకు ఎంత పేరొచ్చిందో ఆమె వాయిస్‌కు కూడా అంతే గుర్తింపువచ్చింది. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్మయి అందమైన గొంతు సామ్‌ పాత్రకు మరింత ప్రాణం పోసింది. ఆ సినిమా తర్వాత సమంత నటించిన పలు చిత్రాలకు చిన్మయి గొంతు అరువచ్చింది. దీంతో వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. చిన్మయి మీటూ ఆరోపణలు చేసినప్పుడు సామ్‌ బహిరంగంగా తన స్నేహితురాలికి మద్దతు పలికింది. అలాగే ఫ్యామిలీ మేన్‌ -2 వెబ్‌ సిరీస్ విషయంలో సామ్‌ని పలువురు విమర్శించినప్పుడు ఈ స్టార్ సింగర్‌ సమంతకు సపోర్టుగా నిలబడింది. ఇలా ఎన్నో సందర్భాల్లో ఒకరికొకరు అండగా నిలిచారు. అయితే ఈ మధ్యన వారు కలుసుకోవడం లేదని, వారి మధ్య సఖ్యత చెడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన చిన్మయి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మేం కలిస్తే చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగులో డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నాకంటూ ఓ కెరీర్ ఏర్పడిందంటే అది సామ్‌ వల్లే. అయితే ఇప్పుడు తన పాత్రలకు తనే డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆమెతో నా జర్నీ ముగిసిందనుకుంటున్నా. తనకు నేను డబ్బింగ్‌ చెప్పే అవకాశం రాదేమో. మేమిద్దరం కలిసినప్పుడల్లా ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయనంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు. నా పర్సనల్‌ లైఫ్‌ను అందరితో పంచుకోవడం నాకిష్టం లేదు. మేమిద్దరం కలుసుకున్నాం.. మాట్లాడుకున్నాం.. డిన్నర్‌కు వెళ్లాం.. అని చెప్పడం వల్ల ఎవరికి లాభం ఉంటుంది? అందుకే మేం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం కూడా. ఒకవేళ మేమిద్దరం కలవాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం. ఇక నా భర్త రాహుల్‌ – సామ్‌ కూడా మంచి స్నేహితులు. ఆమెను చూస్తుంటే నాకెంతో గర్వంగా అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చింది చిన్మయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి