Cyrus Mistry: రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం.. ప్రముఖుల సంతాపం
Cyrus Mistry Demise: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. ముంబైలోని పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్ టైకూన్ మృత్యువాత పడ్డారు.
Cyrus Mistry Demise: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (54) కన్నుమూశారు. ముంబైలోని పాల్ఘర్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఈ బిజినెస్ టైకూన్ మృత్యువాత పడ్డారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాల్గర్ సమీపంలోని చరోటి దగ్గర సైరన్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశారు. . కాగా పాల్ఘర్ దగ్గర రోడ్డు సరిగ్గా లేకపోయినప్పటికి చాలా స్పీడ్‌గా కారును డ్రైవ్ చేశాడు డ్రైవర్. దీంతో కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం నలుగురు ఉన్నారు. సైరస్ తో పాటు మరొకరు కూడా ఈ యాక్సిడెంట్ లో మృతిచెందారు. అలాగే మరో ఇద్దరికీ గాయలైనట్లు సమాచారం. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా ప్రముఖ వ్యాపార దిగ్గజం షాపూర్ జి పల్లోంజి కుమారుడే సైరస్ మిస్ట్రీ. 1968 జులై 4న ఆయన ముంబైలో జన్మించారు. తొలుత ముంబైలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న సైరస్ మిస్త్రీ ఉన్నత చదువుల కోసం లండన్‌కు వెళ్లారు. లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఉన్నత చదువులు కొనసాగించారు. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు. టాటా గ్రూపు హోల్డింగ్ సంస్థ టాటా సన్స్‌లో పల్లోంజీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. రతన్ టాటా తర్వాత ఛైర్మన్ పదవిలో ఎవరిని కూర్చోబెట్టాలా అని చాలా పెద్ద కసరత్తు జరిగింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ, మొత్తం ఐదుగురు ప్రతిపాదిత సభ్యుల నుంచి చివరికి మిస్త్రీని ఎంపిక చేసింది. అలా టాటా గ్రూప్ 6వ ఛైర్మన్‌గా 2012 డిసెంబర్ 28 న బాధ్యతలు చేపట్టారు. అలా 2012-16 మధ్య టాటా గ్రూప్ చైర్మన్ గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే రతన్ టాటాతో విభేదాల కారణంగా ఆయన్ను బయటకు పంపించారు. ప్రస్తుతం షాపూర్ జి, పల్లోంజి సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు. సైరస్ తండ్రి, వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ (93) ఈ ఏడాది జూన్ 28న కన్నుమూశారు. సైరస్ మరియు అతని తండ్రి మరణం తరువాత, అతను అతని తల్లి ప్యాట్సీ పెర్రిన్ దుబాస్, షాపూర్ మిస్త్రీ మరియు ఇద్దరు సోదరీమణులు లైలా మిస్త్రీ మరియు అల్లు మిస్త్రీలతో సైరస్ ఉంటున్నారు. అయితే ఇంతలోపే ఆయన కన్నుమూశారు.
Devastating News My Brother Cyrus Mistry passed away. Can’t believe it.
Rest in Peace Cyrus. pic.twitter.com/YEz7VDkWCY
— Supriya Sule (@supriya_sule) September 4, 2022