Bigg Boss Telugu 6: బిగ్‌బాస్ హౌస్‌లోకి ‘వెంకీ థిస్ ఈజ్ పింకీ’.. ఇంకా ఎవరెవరు వచ్చారంటే?
ఈ సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా పింకీ అలియాస్ సుదీప హౌస్ లోకి అడుగుపెట్టింది. వెంకటేశ్ నటించిన నువ్వునాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది సుదీప.
బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న మోస్ట్ అవైటెడ్ షో బిగ్‌బాస్ సీజన్ 6 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షో ఈసారి మరిన్ని ప్రత్యేకతలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇక ఎప్పటిలాగే నాగార్జున బంగర్రాజు పాటతో ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఫీల్డ్‌లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే నా తరువాతేరా అంటూ నాగార్జున ఇచ్చిన పంచ్ డైలాగ్ అదిరిపోయింది. ఆ తరువాత మోడల్స్‌తో కలిసి చిందులు వేశారు నాగార్జున. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో ప్రత్యేకతలను అందరికీ వివరించారు. కాగా ఈ సీజన్ లో రెండో కంటెస్టెంట్ గా పింకీ అలియాస్ సుదీప హౌస్ లోకి అడుగుపెట్టింది. వెంకటేశ్ నటించిన నువ్వునాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది సుదీప. 1994లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ధర్మరాజు ఎం.ఏ సినిమాతో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సుదీప. ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి సినిమాల్లోనూ సందడి చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లోనూ నటించి మెప్పించింది. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడిన సుదీప.. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది.
కాగా ఈ సీజన్ మొదటి కంటెస్టెంట్‌గా కార్తిక దీపం ఫేమ్ కీర్తి కేశవ్ భట్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. కీర్తి సురేశ్ గాంధారీ పాటకు స్టెప్పులేస్తూ బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చిందీ అందాల తార. కాగా మనసిచ్చి చూడు సీరియల్‌లో భానుగా నటించి బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది కీర్తి. ఈ ధారావాహికలో తనదైన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. బెంగుళూరు పుట్టిపెరిగిన కీర్తికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. అందులో భాగంగానే యాక్టింగ్‌లో శిక్షణ పొంది డ్యాన్స్ కూడా నేర్చుకుంది. ఉన్నత చదువులు పూర్తికాగానే కన్నడలో బుల్లితెర ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కొన్ని సీరియల్స లో నటించింది. ఆతర్వాత ‘కార్తీకదీపం’ సీరియల్ లో కీర్తి..హిమ పాత్రలో కనిపించి మెప్పించింది. కాగా ఆరేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది కీర్తి.