Bigg Boss Telugu 6: బిగ్‌బాస్‌లో సందడి చేసిన అలియా దంపతులు.. తెలుగులో మాట్లాడి, పాటలు పాడిన లవ్లీ కపుల్
Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ లవ్లీకపుల్ అలియాభట్, రణ్‌బీర్ కపూర్ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. సెలబ్రిటీల హోదాలో అడుగుపెట్టిన వీరికి హోస్ట్ అక్కినేని నాగార్జున సాదర స్వాగతం పలికారు.
Alia Bhatt- Ranbir Kapoor: బాలీవుడ్ లవ్లీకపుల్ అలియాభట్, రణ్‌బీర్ కపూర్ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. సెలబ్రిటీల హోదాలో అడుగుపెట్టిన వీరికి హోస్ట్ అక్కినేని నాగార్జున సాదర స్వాగతం పలికారు. సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు తెలుగులో నమస్కారం చెప్పి ఆకట్టుకున్నాడు చాక్లెట్ బాయ్ రణ్‌బీర్. బ్రహ్మాస్త్ర పార్ట్2 రిలీజ్ నాటికి తెలుగు బాగా నేర్చుకుంటానని హామీ ఇచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక అలియా మరోసారి తెలుగు ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది. రెండు రోజుల క్రితంబ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా పాటను తెలుగులో ఆలపించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మరోసారి తన గొంతును సవరించుకుంది. ఈసారి కూడా బ్రహ్మాస్త్ర సినిమాలోని ఓ పాటను తెలుగులో పాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున కూడా హిందీలో పాట పాడి ఆకట్టుకున్నారు.
కాగా అలియా, రణ్‌బీర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రంగా విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను దక్షిణాదిన రాజమౌళి సమర్పిస్తున్నారు. మూడు పార్ట్‌లుగా తెరకెక్కిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
My heart?♥#AliaBhatt #Brahmastra https://t.co/5rsLqhY1Wq
— AAKRITY | TejRan?? | CSK? | (@AAKRITY72636585) September 4, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..