AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos: స్టార్ హీరో భార్య.. లక్ష్మీదేవిలా చిరునవ్వులు చిందిస్తోన్న అచ్చ తెలుగమ్మాయి .. ఎవరో గుర్తు పట్టారా..!

ఎన్టీఆర్ తల్లి షాలినితో కలసి సందడి చేశారు. సంప్రదాయ లుక్‌లో అందంగా కనిపించడమే కాదు.. అసలు ఆ ఫంక్షన్ లో లక్ష్మి ప్రణతి హైలైట్ గా నిలిచారని చెప్పవచ్చు

Viral Photos: స్టార్ హీరో భార్య.. లక్ష్మీదేవిలా చిరునవ్వులు చిందిస్తోన్న అచ్చ తెలుగమ్మాయి .. ఎవరో గుర్తు పట్టారా..!
Jr Ntr Wife Lakshmi
Surya Kala
|

Updated on: Sep 04, 2022 | 11:30 AM

Share

Viral Photos: సినీ నటులు, క్రీడాకారులకు సంబంధించిన ఈ చిన్న విషయమైనా ఆసక్తికరమే.. ఇక తమ అభిమాన నటీనటులకు సంబంధించిన ఫొటోలు కనిపిస్తే చాలు.. వెంటనే ఫ్యాన్స్ వాటి షేర్ చేస్తూ తెగ సందడి చేస్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో భార్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ హీరో భార్య భారతీయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ.. పట్టు చీర కట్టుకుని.. నగలు పెట్టుకుంది అందంగా అలంకరించుకుంది. హఠాత్తుగా చూస్తే లక్ష్మీదేవి నేలమీదకు దిగి వచ్చిందా అనిపిస్తుంది ఎవరికైనా.. ఆమె ఎవరో కాదు.. నందమూరి అందగాడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి.

ఎన్టీఆర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో గడపడానికి తగిన సమయాన్ని కేటాయిస్తారు. భార్య లక్ష్మీప్రణతి, ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతార.  అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి ఎక్కువగా మీడియా ముందుకు రారు. చాలా సింపుల్ గా ఏ హంగులు ఆర్భాటాలు లేకుండా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు.  సాదాసీదా జీవితాన్ని గడుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవల లక్ష్మి ప్రణతి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకక్కి హాజరయ్యారు. ఎన్టీఆర్ తల్లి షాలినితో కలసి సందడి చేశారు. సంప్రదాయ లుక్‌లో అందంగా కనిపించడమే కాదు.. అసలు ఆ ఫంక్షన్ లో లక్ష్మి ప్రణతి హైలైట్ గా నిలిచారని చెప్పవచ్చు.

తెలుగుదనం ఉట్టిపడేలా పట్టు చీరలో ఒంటినిండా బంగారు, డైమండ్ నగలు ధరించి ఎంతో అందంగా కనిపించారు. చిరునవ్వుతో నిండైన చీరలో లక్ష్మి ప్రణతి సాక్షాత్తు మహా లక్ష్మి నేలకు దిగి వచ్చిందా అన్నట్లు కనిపించారు. ఇప్పుడు ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి వివాహం 2011లో జరిగింది.  ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.