Childhood Pic: ఈ ఐదుగురు బాలురుల్లో ఒకరు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ వెరీ వెరీ స్పెషల్.. అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక ఫోటోని షేర్ చేసి...

Childhood Pic: ఈ ఐదుగురు బాలురుల్లో ఒకరు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరో గుర్తుపట్టగలరా..?
Pawan Kalyan Childhood Pic
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2022 | 6:58 AM

Childhood Pic: బాల్యం ఎవరికైనా మధురమే.. చిన్ననాటి స్మృతులు తలచుకోని వారు.. బాల్యంలో జరిగిన అనుభూతులను గుర్తు చేసుకొని వారు బహు అరుదు అని చెప్పవచ్చు. అంతేకాదు తమ జీవితంలో అరుదైన సంఘటనలు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు. తమ అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో  ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఈ పిక్ వెరీ వెరీ స్పెషల్.. అంటూ అభిమానులు షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఒక ఫోటోని షేర్ చేసి… ఈ ఫోటో నేను తీసిన మొదటి ఫోటో.. ఈ ఐదుగురు బాలురులలో ఒకరు మీకు బాగా తెలిసిన వ్యక్తి.. ప్రస్తుతం మీ అభిమాన హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం అని అన్నారు. మీరు ఆ బాలుడు ఎవరో గుర్తు పట్టారా.. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగా హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

మెగా స్టార్ చిరంజీవి ముద్దుల తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ చిన్నారి బాలుడు. కొణిదెల వెంకట్రావు, అంజనీదేవి దంపతులకు మొదటి సంతానం చిరంజీవి.. అయితే పవన్ కళ్యాణ్ చివరి సంతానం. 1968 సెప్టెంబరు 2న జన్మించాడు. వెండి తెరపై హీరోగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో 1996 లో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. పవన్ నటుడు మాత్రమే కాదు.. సినీ నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత. సామజిక మార్పుకోసం జనసేన రాజకీయ పార్టీ ని స్థాపించి.. ప్రజల సమస్యలపై తన గళం వినిపిస్తున్నారు. హిట్ ప్లాప్ లతో సంబంధం లేని క్రేజ్ పవన్ కళ్యాణ్ సొంతం. అందరి హీరోలకు అభిమానులుంటారు. పవన్ కళ్యాణ్ కు భక్తులుంటారు. అత్తారింటికి దారేది సినిమాతో టాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించాడు. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. ఇటీవల వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాతో వరస హిట్స్ అందుకున్న పవన్ కళ్యాణ్.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ నేపధ్య సినిమా హరిహర వీరమల్లు తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ కు టీవీ 9 శుభాకాంక్షలను తెలుపుతూ.. ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే