AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూ సూద్.. స్టూడెంట్ రిపోర్టర్ కు ఫిదా, భారీ సాయం ప్రకటన

స్వచ్ఛంద సంస్థ సూద్ ఛారిటీ ఫౌండేషన్‌తో కలిసి చురుకుగా పని చేస్తున్నాడు. ఆసవరమైన వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ.. ఆర్ధిక సాయం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్టూడెంట్ రిపోర్దర్ గా మారి తమ పాఠశాలలో ఉన్న సమస్యల వీడియో సోనూ సూద్ దృష్టికి చేరుకుంది.

Sonu Sood: మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూ సూద్.. స్టూడెంట్ రిపోర్టర్ కు ఫిదా, భారీ సాయం ప్రకటన
Sonu Sood
Follow us
Surya Kala

|

Updated on: Aug 25, 2022 | 7:29 AM

Sonu Sood: కరోనావైరస్ మహమ్మారి దేశంలో అలజడి సృష్టించిన సమయంలో నటుడు సోనూ సూద్ మానవత్వంతో స్పందించాడు. దాతృత్వంతో వేలాది మందికి అండగా నిలిచి దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదలైన సేవాకార్యక్రమాలు పరంపర నేటికీ కొనసాగిస్తున్న ఉన్నాడు. తన స్వచ్ఛంద సంస్థ సూద్ ఛారిటీ ఫౌండేషన్‌తో కలిసి చురుకుగా పని చేస్తున్నాడు. ఆసవరమైన వారికి నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ.. ఆర్ధిక సాయం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ స్టూడెంట్ రిపోర్దర్ గా మారి తమ పాఠశాలలో ఉన్న సమస్యల వీడియో సోనూ సూద్ దృష్టికి చేరుకుంది. స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలను పదిమందికి తెలిసేలా వివరిస్తూ.. రిపోర్టింగ్ తో  వైరల్ అయిన సర్ఫరాజ్ అనే స్టూడెంట్ చదువు బాధ్యతలను సోనూ తీసుకున్నాడు.

ఝార్ఖండ్‌ లోని గొడ్డా జిల్లాలోని మహ్గామా బ్లాక్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతూ.. అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచింది. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు. పాఠశాలకు రాని ఉపాధ్యాయులు , కనీస సదుపాయాలకు కరువుఅయిన నేపథ్యంలో స్కూల్ లో చదువుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో సర్పరాజ్ అనే  12 ఏళ్ల స్టూడెంట్ రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. ఆ మైక్ ను పట్టుకుని తోటి విద్యార్థులను ఇంటర్వ్యూ చేస్తూ.. స్కూల్ ఆవరణలో ఉన్న సమస్యలను పదిమందికి తెలిసేలా వివరించాడు. ఈ రిపోర్టింగ్ తో సర్ఫరాజ్ వైరల్ అయ్యాడు. దీనిని చూసిన సోనూసూద్​ తాజాగా స్పందించారు. సర్ఫరాజ్​ చదువు కోసం ముంబయిలో అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

తన పాఠశాల క్యాంపస్ చుట్టూ ఉన్న పరిస్థితులను వివరిస్తూ.. పాఠశాలలోని తరగతి గదులు , బాత్‌రూమ్‌లు ఎలా శిథిలావస్థలో ఉన్నాయో చూపిస్తూ స్కూల్ టీచర్ల నిర్లక్ష్యాన్ని కూడా సర్ఫరాజ్ ప్రస్తావిస్తూ.. ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పాఠశాల వ్యవస్థను సరిచేయాలని .. తరగతి గదులు, బాత్‌రూమ్‌లను మరమ్మతులు చేయాలని సర్ఫరాజ్ జార్ఖండ్ విద్యా మంత్రికి విజ్ఞప్తి చేశాడు. తెగ వైరల్ అయిన వీడియో చూసి ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెట్టి షేర్​ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..