Viral Video: కష్టాన్ని ఇష్టంగా పడేది అమ్మ.. ఎండలో ఇద్దరు పిల్లలతో అమ్మపడుతున్న కష్టానికి నెటిజన్లు వందనం.. వీడియో చూస్తే మీరు కూడా సలాం అంటారు..

బ్లాగర్ క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు..  'ఇది చూసి నేను చాలా ప్రేరణ పొందాను. జొమాటో డెలివరీ ఏజెంట్ ఇద్దరు పిల్లలతో రోజంతా ఎండలో తిరుగుతూ.. ఆహారం డెలివరీ చేస్తోంది. ఆమెను చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

Viral Video: కష్టాన్ని ఇష్టంగా పడేది అమ్మ.. ఎండలో ఇద్దరు పిల్లలతో అమ్మపడుతున్న కష్టానికి నెటిజన్లు వందనం.. వీడియో చూస్తే మీరు కూడా సలాం అంటారు..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2022 | 2:44 PM

Viral Video: ప్రపంచంలో కష్టపడేవారికి ఎప్పుడూ ఏదొక పని ఉంటుంది. దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటూ.. తమ కుటుంబాన్ని పోషించుకునేవారు ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ గా కష్టపడి పనిచేస్తున్నవారి గురించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. వీరి భావోద్వేగ, స్ఫూర్తిదాయకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఒక మహిళ  వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ధైర్యానికి.. కుటుంబం పట్ల బాధ్యతకు ఎవరైనా సరే సలాం చేయాల్సిందే.  వాస్తవానికి, వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో  ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ( Zomato) సంస్థకు ఈ మహిళ లేడీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఇద్దరు చిన్న పిల్లలను తీసుకుని మధ్యాహ్నం  మండుటెండలో విధులను నిర్వహిస్తూ.. ఆహారాన్ని డెలివరీ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రజల హృదయాన్ని హత్తుకుంది. కొంతమంది భావోద్వేగానికి కూడా గురయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ జొమాటో మహిళా డెలివరీ ఏజెంట్‌తో మాట్లాడుతున్నట్లు మీరు చూడవచ్చు,  ఆ మహిళ తన కుమార్తెను బేబీ క్యారియర్ బ్యాగ్ లో పెట్టుకుని.. ఓ చేతిలో జొమాటో బ్యాగ్‌.. ఫుడ్ డెలివరీ కవర్ ను పట్టుకుని ఉంది. ఆ మహిళ పక్కన ఓ బాలుడు నిల్చుని ఉన్నాడు. ఇద్దరు పిల్లలతో మహిళ ఆహారం డెలివరీ చేయడం చూసి బ్లాగర్ హృదయం ద్రవించింది. ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈ సమయంలో, మహిళ కుమారుడు కూడా ఆమెతో ఉన్నాడు. రోజంతా ఎండలో తన పిల్లలతో ఇలా ఆహారాన్ని డెలివరీ చేస్తానని ఆ మహిళ వీడియోలో చెప్పింది.

ఇవి కూడా చదవండి

మహిళా ఫుడ్ డెలివరీ ఏజెంట్ వీడియోను ఇక్కడ చూడండి:

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్‌క్లబ్బిసౌరభపంజ్వానీ అనే ఖాతాలో షేర్ చేయబడింది. బ్లాగర్ క్యాప్షన్‌లో ఇలా వ్రాశాడు..  ‘ఇది చూసి నేను చాలా ప్రేరణ పొందాను. జొమాటో డెలివరీ ఏజెంట్ ఇద్దరు పిల్లలతో రోజంతా ఎండలో తిరుగుతూ.. ఆహారం డెలివరీ చేస్తోంది. ఆమెను చూసి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది. ఒక వ్యక్తి  ఏదైనా చేయగలడని నిరూపిస్తోంది. ఈ వీడియోకి 10 లక్షల లైక్స్ వచ్చాయి. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఒక వినియోగదారుడు ఈ మహిళ ఎంత కష్టపడి పని చేస్తుందో అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాను. అదే సమయంలో మరొకరు ఈ మహిళ ధైర్యానికి నేను వందనం చేస్తున్నానని చెప్పారు. మొత్తానికి ఈ మహిళ వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురి చేసింది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..