Viral Video: ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపి.. లావా చిమ్ముతుంటే వేడుక చూస్తున్న యువకులు.. వీడియో వైరల్

శాంతియుతంగా ఉన్న అగ్నిపర్వతం దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పై నుంచి ఒక వ్యక్తి.. బలంగా ఓ రాయిలాంటి వస్తువును అగ్నిపర్వతం లోయలోకి విసిరారు. అనంతరం చోటు చేసుకున్న దృశ్యం ఆశ్చర్యంతో పాటు.. ఆ యువకుల చర్యపై కోపం కూడా వస్తుంది. 

Viral Video: ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపి.. లావా చిమ్ముతుంటే వేడుక చూస్తున్న యువకులు.. వీడియో వైరల్
Volcano Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 6:12 PM

Viral Video: అగ్నిపర్వతాలు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వాటిలో ఒకటి. ఒక విధంగా.. అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి.. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెంది.. విధ్వంసాన్ని సృష్టిస్తాయో ఎవరికీ తెలియదు. కనుక అగ్నిపర్వతాల దగ్గర మానవులు తగిన జాగ్రత్తలు తీసుకుని మసులుతుంటారు. నిద్రపోతున్న అగ్నిపర్వతం బధ్ధల్లై.. విధ్వంసం కలిగిస్తే.. ప్రజల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జీవనాన్ని కష్టతరం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వందలాది అగ్నిపర్వతాలు ఉన్నాయి.. కానీ వాటిల్లో కొన్ని మాత్రమే ప్రమాదకరంగా మారతాయి.  ముఖ్యంగా అగ్నిపర్వతాలు చిందించే లావా చాలా ప్రమాదకరం. మనిషి ఎముకలను కూడా క్షణంలో కరిగించగలదు. అలంటి ఓ అగ్నిపర్వతం ప్రశాంతంగా ఎటువంటి కదలికలు లేకుండా ప్రకృతిని చూస్తున్నట్లు ఉంది.. అయితే ఇద్దరు వ్యక్తులు.. అలంటి ప్రశాంతమైన అగ్నిపర్వతాన్ని రగిలించారు.   ప్రస్తుతం అగ్నిపర్వతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంతియుతంగా ఉన్న అగ్నిపర్వతం దగ్గరకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పై నుంచి ఒక వ్యక్తి.. బలంగా ఓ రాయిలాంటి వస్తువును అగ్నిపర్వతం లోయలోకి విసిరారు. అనంతరం చోటు చేసుకున్న దృశ్యం ఆశ్చర్యంతో పాటు.. ఆ యువకుల చర్యపై కోపం కూడా వస్తుంది.

ఇద్దరు వ్యక్తులు ఎత్తైన కొండపై నిలబడి చిన్న రాయిని కిందకు విసిరినట్లు మీరు వీడియోలో చూడవచ్చు. నిజానికి క్రింద అగ్నిపర్వతం ప్రశాంతంగా ఉంది. మొదట అది అగ్నిపర్వతం అని చూపరులకు తెలియదు.. కానీ రాయి కింద పడగానే లావా చిమ్మడం మొదలైంది. అది చిన్నగా మొదలై.. క్రమంగా మంట పెరగడం కనిపిస్తుంది. ఆ ఘటన చూసిన వారికి ఎవరైనా నిద్ర పోతున్న గాడిదను లేపి తన్నించుకున్నట్లు  అన్న సామెత గుర్తుకొస్తుంది. అయితే అగ్నిపర్వతం భారీ విధ్వంసం సృష్టించకపోయినా అగ్నిపర్వతం నిప్పులు చిమ్ముతూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

రాళ్లు విసిరిన వీడియో

ఈ వీడియో బిల్టెక్ వీడియోస్ అనే ID తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు . కేవలం 23 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 3.8 మిలియన్లు అంటే 38 లక్షలవ్యూస్ ను సొంతం చేసుకుంది. వివిధ రకాల కామెంట్స్ చేశారు. ఈ  అగ్నిపర్వతం ఎక్కడ ఉందని ఒకరు కామెంట్ చేయగా..  లావా ఎగసి పడేలా చేసిన ఆ యువకుల చర్యలపై కొందరు మండి పడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..