Viral Video: కూతురిపై తండ్రి ప్రేమ ఆకాశమంత.. అమ్మకాని అమ్మకి వీడ్కోలు చెబుతున్న నాన్న.. వీడియో వైరల్..

తాజాగా తండ్రికూతుళ్ల బంధాన్ని చాటే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  కూతురికి పెళ్లి చేసి తమ ఇంటి నుంచి వీడ్కోలు చెప్పడానికి ముందు తల్లిదండ్రులు తమ కుమార్తె పాదముద్రలను భద్రపరచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు.

Viral Video:  కూతురిపై తండ్రి ప్రేమ ఆకాశమంత..  అమ్మకాని అమ్మకి వీడ్కోలు చెబుతున్న నాన్న.. వీడియో వైరల్..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 2:59 PM

Viral Video: తండ్రి కూతుళ్ల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతుళ్లు తండ్రి మనసుకు చాలా దగ్గర. అందుకే తన కూతురికి పెళ్లి చేసిన తర్వాత.. తన ఇంటి లక్ష్మీదేవి.. మరో ఇంటికి వెలుగులునింపడానికి వెళ్తున్న సమయంలో తండ్రి బాధ గురించి వర్ణించలేము. చిన్న పిల్లాడిలా తండ్రి వెక్కి వెక్కి ఏడిస్తే.. ఇక కూతురు తండ్రిని విడిచి వెళ్లలేను అంటున్నట్లు మరో ఇంటికి పయనం అవుతుంది. తాజాగా తండ్రికూతుళ్ల బంధాన్ని చాటే వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  కూతురికి పెళ్లి చేసి తమ ఇంటి నుంచి వీడ్కోలు చెప్పడానికి ముందు తల్లిదండ్రులు తమ కుమార్తె పాదముద్రలను భద్రపరచడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. వైరల్ క్లిప్‌లో తండ్రి చేసిన పనిని చూసి నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో..  కుమార్తె కుర్చీపై కూర్చొని ఉంది. తల్లిదండ్రులు నేలమీద కూర్చుని ఒక తెల్లటి బట్టను నేలపై పరిచారు. కుమార్తె పాదముద్రలను తీయడానికి ముందు తండ్రి ఎంతో ప్రేమగా కూతురు పాదాలను నీరు, పాలతో కడిగాడు. అనంతరం ఆ పాదాలను సుతిమెత్తగా తడిచాడు. తల్లిదండ్రులు తనపై చూపిస్తున్న ప్రేమను చూసి కూతురు కంట కన్నీరు వచ్చినట్లు మనం చూడవచ్చు. చాలా ఉద్వేగభరితమైన దృశ్యం. కాళ్లు కడిగిన తర్వాత ఎర్రటి నీరులో కూతురు పాదాలను పెట్టి.. అనంతరం ఆ పాదాలతో కూతురు తెల్లటి బట్టపై నిల్చుంది. అప్పుడు కూతురు పాదాల ముద్రలు ఆ తెల్లటి గడ్డపై ముద్రించి వాటిని ప్రేమగా భద్రపరచుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తండ్రీ కూతుళ్ల ఎమోషనల్ వీడియోపై ఓ లుక్ వేయండి..   

రాంచీ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. ‘ఎమోషనల్ మూమెంట్. తల్లిదండ్రులు.. తమ కుమార్తెకు తమ ఇంటి నుంచి వీడ్కోలు చెప్పడానికి ముందు కుమార్తె పాదముద్రలను భద్రపరచుకున్నారు అనే క్యాప్షన్ ఇచ్చారు. 2 నిమిషాల 20 సెకన్ల ఈ క్లిప్‌ని చూసి నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. కొన్ని గంటల క్రితం షేర్ చేయబడిన ఈ వీడియోకు వేలాది వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..