Viral Video: తీవ్రమైన కోపంతో వస్తువులను విసిరే ప్రయత్నంలో బాల్కనీ నుంచి కిందపడిన వ్యక్తి.. వీడియో వైరల్

ఒక వ్యక్తి చాలా కోపంగా  ఉన్నాడు..అతను కోపంతో చేసిన పనికి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంటి బాల్కనీలో నిల్చున్న వ్యక్తి కింద ఎవరితోనో గొడవ పడుతుండటం వీడియోలో చూడొచ్చు.

Viral Video: తీవ్రమైన కోపంతో వస్తువులను విసిరే ప్రయత్నంలో బాల్కనీ నుంచి కిందపడిన వ్యక్తి.. వీడియో వైరల్
Funny Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Aug 22, 2022 | 9:04 PM

Viral Video: కోపం చాలా ప్రమాదకరమైన విషయం. వ్యక్తిని ఏ స్టేజ్ కు అయినా తీసుకెళ్తుంది.  కోపం వచ్చిన వ్యక్తి విచక్షణ మరచి ..మంచి చెడుల గురించి ఆలోచించకుండా విచక్షణ రహితంగా ప్రవర్తిస్తారు. కోపం వచ్చినప్పుడు ఏమీ ఆలోచించరు, నేరుగా దాడి చేస్తారు. కోపం కారణంగా, సంబంధాలు కూడా క్షిణిస్తాయని.. బుద్ధ భగవానుడు చెప్పాడు. కోపం పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అందుకే  ప్రతి వ్యక్తి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. కోపంతో ఎవరినైనా చంపడానికి కూడా వెనుకాడరని చాలాసార్లు చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం , కోపానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూసి మీరు నవ్వుతూ ‘మనం ఏది చేస్తే.. అదే తిరిగి వస్తుంది’ అని కామెంట్ చేస్తున్నారు.

ఒక వ్యక్తి చాలా కోపంగా  ఉన్నాడు..అతను కోపంతో చేసిన పనికి ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఇంటి బాల్కనీలో నిల్చున్న వ్యక్తి కింద ఎవరితోనో గొడవ పడుతుండటం వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో, అతను చాలా కోపంగా ఉన్నాడు. గదిలోకి వెళ్లి కొన్ని వస్తువులను తెచ్చి.. కోపంగా  కిందకు విసిరేందుకు ప్రయత్నించడు. కానీ దురదృష్టవశాత్తు అతను సామాను విసిరే ప్రక్రియలో తన బ్యాలెన్స్ కోల్పోయి.. సామానుతో పాటు తనంతట తానుగా బాల్కనీ కిందకు పడిపోయాడు. అందుకే కోపం ఫలితం ఎల్లప్పుడూ చెడుగా.. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో డార్విన్ అవార్డ్స్ అనే ఐడితో షేర్ చేయబడింది. ఈ 11 సెకన్ల వీడియో 84 లక్షల వ్యూస్ ను వేలాది లైక్స్ ను సొంతం చేసుకుంది. వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతున్నారు. ఆ వ్యక్తి తన కర్మల ఫలాలను పొందాడని కామెంట్ చేస్తున్నారు.  అదే సమయంలో, మీకు ఫిజిక్స్ , బ్యాలెన్స్ గురించి తెలియనప్పుడు ఇలా జరుగుతుందని ఫన్నీ కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?