Viral Video: పరుగుపందెంలో రన్నర్స్ కంటే స్పీడ్ గా పరుగెడుతున్న కెమెరామెన్.. ఫన్నీ వీడియో వైరల్..

రేసింగ్ ట్రాక్‌పై రేసు జరుగుతోంది. రేసులో గెలవడానికి రన్నర్లు వేగంగా పరుగెత్తుతున్నారు. అయితే ఈ రేసులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రన్నర్స్‌తో పాటు కెమెరామెన్ కూడా వేగంగా పరిగెత్తడం.

Viral Video: పరుగుపందెంలో రన్నర్స్ కంటే స్పీడ్ గా పరుగెడుతున్న కెమెరామెన్.. ఫన్నీ వీడియో వైరల్..
Vairal Video
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2022 | 9:03 PM

Viral Video: క్రీడాకారుడుగా సక్సెస్ అందుకోవడం అంత ఈజీకాదు. దీనికి కృషి, అభ్యాసం అవసరం. ఉసేన్ బోల్ట్ పేరు క్రీడాభిమానులకు పరిచయమే. ఆల్ టైమ్ గొప్ప రన్నర్లలో ఒకడు. రేసు ప్రపంచంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 100 మీటర్లు లేదా 200 మీటర్లు, ఆపై 4×100 మీటర్ల రేసులో ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డులు సృష్టించాడు . ప్రపంచంలో చాలా మంది రన్నర్లు ఉన్నప్పటికీ.. కొందరి పరుగు సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. పరుగు పందానికి సంబంధించిన వివిధ రకాల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే అందులో చాలా ఫన్నీ విషయం కనిపించింది. దీనిని చూసి  ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు.

రేసింగ్ ట్రాక్‌పై రేసు జరుగుతోంది. రేసులో గెలవడానికి రన్నర్లు వేగంగా పరుగెత్తుతున్నారు. అయితే ఈ రేసులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రన్నర్స్‌తో పాటు కెమెరామెన్ కూడా వేగంగా పరిగెత్తడం. అతను కెమెరాను భుజంపై పెట్టుకుని చాలా వేగంగా పరిగెత్తాడు. రన్నర్లు కూడా ఆ కెమెరా మెన్ కంటే వెనుకనే ఉన్నారు. కెమెరామెన్ తమ కంటే వేగంగా పరిగెత్తడం చూసి రన్నర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు వివిధ రకాల రేసుల వీడియోలను తప్పక చూసి ఉంటారు, కానీ కెమెరామెన్ మాత్రమే గెలుపొందిన ఇలాంటి సరదా రేసును మీరు చాలా అరుదుగా చూస్తాం. వీడియో చూసిన తర్వాత, కెమెరామెన్ తప్పు కెరీర్ ఎంచుకున్నాడు..  అతను రన్నర్ అయి ఉండాల్సిందని సరదాగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఏవియేటర్ అనిల్ చోప్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ ఫన్నీ రేసింగ్ వీడియో షేర్ చేశారు. ఈ కెమెరామెన్ తప్పు వృత్తిని ఎంచుకున్నాడు’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 10 సెకన్ల ఈ వీడియో ఇప్పటివరకు 16 వేలకు పైగా వ్యూస్ ను, వందల లైక్స్ ను సొంతం చేసుకుంది. ఈ పరుగు పందెంలో కెమెరామెన్‌ని విజేతగా ప్రకటించాలని ఒకరు కామెంట్ చేయగా.. ఒలింపిక్స్‌కు  పంపించాలని మరొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?