Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan: తన అభిమాన హీరో పాదాలు తాకి నమస్కరించిన అభిమాని.. తిరిగి స్టార్ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ శనివారం ముంబైలో జరిగిన ఫిట్‌నెస్ ఈవెంట్‌కు హాజరయ్యారు . ఆనందోత్సాహాల మధ్య ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతగా ఒక అభిమాని గెలిచాడు.

Hrithik Roshan: తన అభిమాన హీరో పాదాలు తాకి నమస్కరించిన అభిమాని.. తిరిగి స్టార్ హీరో చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా..
Actor Hrithik Roshan
Follow us
Surya Kala

|

Updated on: Aug 28, 2022 | 4:33 PM

Hrithik Roshan: అభిమానులే తమ పాలిట దేవుళ్ళు అని చాలామంది స్టార్ హీరోలు తరచుగా చెబుతుంటారు. అందుకనే నటీనటులు తమ ఫ్యాన్స్ కష్టంలో ఉన్న తెలిసిన వెంటనే వారికీ అండగా నిలబడతారు. తమకు ఇష్టమైన హీరో కనిపించగానే అభిమానుల సంతోషము వెలకట్టలేనిది.. వారిని చూసిన వెంటనే తమ అభిమానాన్ని చాటుకుంటూ.. పాదాలకు నమస్కరించేవారు కొందరు.. కౌగిలించుకునేవారు ఇంకొందరు ఇలా రకరకాలుగా ఉంటారు. తాజాగా తన అభిమాన హీరో హృతిక్ రోషన్ని చూసిన వెంటనే అతని పాదాలను తాకి దణ్ణం పెట్టుకున్నాడు ఓ అభిమాని.. అయితే అప్పుడు ఆ స్టార్ హీరో పని అందరి మనసుని దోచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ శనివారం ముంబైలో జరిగిన ఫిట్‌నెస్ ఈవెంట్‌కు హాజరయ్యారు . ఆనందోత్సాహాల మధ్య ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పోటీల్లో విజేతగా ఒక అభిమాని గెలిచాడు. ఆ అభిమాని వేదికమీదకు వచ్చిన వెంటనే.. హృతిక్ రోషన్ పాదాలను తాకాడు. దీంతో హీరో ఆశ్చర్యపోయాడు. ముందు అవాక్కై.. తర్వాత తేరుకున్న హృతిక్ ముందుకు వెళ్లి తన అభిమానుల పాదాలను తాకి నమస్కారం చేశాడు. ఈ ఘటన  జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఆహుతులు వీడియో తీసేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్ భవాని ఖాతా లో షేర్ చేసిన ఈ వీడియోలో.. హృతిక్ కొంతమంది పోటీ విజేతలకు గూడీ బ్యాగ్‌లను బహుమతిగా ఇస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఒక యువకుడు వేదికపైకి వచ్చినప్పుడు, అతను మొదట హృతిక్ కు నమస్కరించాడు. పలకరించిన అనంతరం హృతిక్ పాదాలను తాకాడు. అతను తన మొబైల్ ఫోన్‌లో హృతిక్‌కి ఏదో చూపించాడు. ఆ యువకుడు హృతిక్‌తో కొద్దిసేపు మాట్లాడాడు. అప్పుడు తన అభిమానిని హృతిక్ ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది వీడియోలో.

నియాన్ గ్రీన్ టీ-షర్ట్,  తెలుపు ట్రాక్‌లను ధరించి, హృతిక్ ఈవెంట్‌లో చాలా అందంగా కనిపించాడు. వైరల్ అవుతున్న వీడియోకి నెటిజన్లు ఫిదా.. , “”హృతిక్ చాలా వినయపూర్వకమైన వ్యక్తి ,  వినయపూర్వకమైన సూపర్ స్టార్ , మంచి అందగాడు” అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..