Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devatha Serial: మాకొద్దు అనుబంధాల ఆలయం అంటోన్న ప్రేక్షకులు.. దారుణంగా పడిపోతున్న దేవత రేటింగ్..

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం అవుతున్న దేవత... అనుబంధాలకు నిలయం అంటూ సీరియల్ మొదట్లో ఎంతో ఆసక్తికరంగా ఉండేది. అప్పట్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపానికి దేవత పోటీ అయిందని కూడా చెప్పవచ్చు

Devatha Serial: మాకొద్దు అనుబంధాల ఆలయం అంటోన్న ప్రేక్షకులు.. దారుణంగా పడిపోతున్న దేవత రేటింగ్..
Devatha Serial Trp
Follow us
Surya Kala

|

Updated on: Aug 29, 2022 | 9:09 AM

Devatha Serial: బుల్లి తెరపై ప్రేక్షకులు అత్యంత ఇష్టంగా చూసేవి సీరియల్స్ . ముఖ్యంగా సీరియల్ ఒక్కసారి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు.. ఆ సీరియల్స్ అత్యంత ఆదరణను సొంతం చేసుకుంటాయి. అయితే చూస్తున్నారు కదా అంటూ.. ఆ సీరియల్స్ ను సంవత్సరాలు సంవత్సరాలు ప్రసారం చేస్తూ ఉంటారు. అలా సీరియల్స్ ను ప్రసారం చేయడం కోసం చిన్న చిన్న సీన్స్ ను రోజుల తరబడి జీడిపాకం కంటే ఎక్కువగా సాగదీస్తూ ఉంటారు. అయితే ఈ సాగదీత క్రమంలో ప్రేక్షకుల ఆదరణను క్రమంగా కోల్పోతుంటారు. అందుకు ఉదాహరణ తాజా సీరియల్ కార్తీకదీపం అని చెప్పవచ్చు. బుల్లి తెరపై సంచలనం సృష్టించి.. స్టార్ హీరో కార్యక్రమాలను సైతం తలదన్నేలా రికార్డ్ స్థాయి రేటింగ్ తో ఒకానొక సమయంలో దూసుకుపోయింది. అయితే చూస్తున్నారు కదా అంటూ.. సీరియల్స్ లో ఎలాంటి లాజిక్స్ లేకుండా తీస్తుండడంతో క్రమంగా ప్రేక్షకుల ఆదరణ కోల్పోయింది. దీంతో మళ్ళీ హైప్ లేపడానికి ఆ యూనిట్ పడని కష్టం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సాగదీత సీరియల్ సెక్షన్ లో మరో సీరియల్ చేరుకుందని అంటున్నారు బుల్లి తెర ప్రేక్షకులు.

ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో ప్రసారం అవుతున్న దేవత… అనుబంధాలకు నిలయం అంటూ సీరియల్ మొదట్లో ఎంతో ఆసక్తికరంగా ఉండేది. అప్పట్లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న కార్తీకదీపానికి దేవత పోటీ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రధాన పాత్ర రుక్మిణి, తన భర్త ఆదిత్య దగ్గరకు ఎప్పుడు చేరుకుంటుందని చూస్తూనే ఉన్నారు. అయితే రుక్మిణి తన కూతురిని భర్త ఆదిత్య దగ్గరకు పంపే ప్రయత్నంలో ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడప్పుడే కలవరని తెలుస్తోంది. ఈ క్రమంలో రుక్మిణి, ఆదిత్య, మాధవ్ కు మధ్య జరుగుతున్న సన్నివేశాలపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.

అంతేకాదు డైరెక్టర్ కు సీరియల్ లో ఏ ట్విస్ట్ పెట్టాలో అర్థం కాక సాగదీస్తున్నాడని ప్రేక్షకులు భావిస్తున్నాడు. అందుకనే.. ఒకే స్టోరీతో ఒకే కథనంతో రకరకాల సన్నివేశాలను ప్రసారం చేస్తుండడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. రుక్మిణి మాధవ్ ల మధ్య సన్నివేశాలు సగటు ప్రేక్షకుల సహనానికి పరీక్షగా భావిస్తున్నాడు.. ఆదిత్య తన కుటుంబ సభ్యులకు రుక్మిణి, కూతురు గురించి అసలు విషయం చెబితే సరిపోయేదే.. లేదా రుక్మిణిని తన ఫ్యామిలీకి కనిపించేలా చేసి.. ఏదైనా ట్విస్ట్ పెట్టినా సరిపోయేది.. కానీ ఏ విధమైన ట్విస్ట్ లేకుండా.. సాగదీస్తున్నాడు. దీంతో దేవత సీరియల్ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ కోల్పోతున్నట్లు తెలుస్తోంది. భారీగా రేటింగ్ పడిపోయింది. అంతేకాదు దేవతను ఇక చూడడం మా వల్ల కాదంటూ సీరియల్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి దర్శకుడు ఇప్పుడైనా తన ఆలోచనాతీరు మార్చుకుని మళ్ళీ ప్రేక్షకుల ఆదరణ కోసం సరికొత్త కథ, కథనంతో వస్తారేమో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..