Comedian Ali: పెళ్లిపీటలెక్కనున్న కమెడియన్‌ అలీ కూతురు.. వరుడు ఎవరో తెలుసా?

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించాడు అలీ (Ali). కమెడియన్‌గా, హీరోగా అందరి మెప్పు పొందాడు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. సిల్వర్‌ స్ర్కీన్‌పై తన నటనతో నవ్వుల పువ్వులు పూయించిన..

Comedian Ali: పెళ్లిపీటలెక్కనున్న కమెడియన్‌ అలీ కూతురు.. వరుడు ఎవరో తెలుసా?
Comedian Ali
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2022 | 6:38 AM

ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించాడు అలీ (Ali). కమెడియన్‌గా, హీరోగా అందరి మెప్పు పొందాడు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. సిల్వర్‌ స్ర్కీన్‌పై తన నటనతో నవ్వుల పువ్వులు పూయించిన ఈ నటుడు ఇప్పుడు బుల్లితెరపై కూడా సత్తాచాటున్నాడు. పలు టీవీ షోలకు హోస్ట్‌గా, జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఆయన సతీమణి జుబేదా అలీ సైతం సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటోంది. సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్నీ విషయాలను షేర్‌ చేసుకుంటోంది. ఇదిలా ఉంటే అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూతురు నిశ్చితార్థం వీడియోను జుబేదా అలీ తన ఛానెల్‌లో షేర్‌ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా అంగరంగ వైభవంగా జరిగిన అలీ కూతురు ఎంగేజ్‌మెంట్‌ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్‌ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. కాబోయే నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించారు. ఈక్రమంలో అలీకి కాబోయే అల్లుడు ఎవరు? ఏంచేస్తారు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే అలీ కాబోయే అల్లుడు ఒక డాక్టర్‌ అట. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ వైద్యులేనట. ఇక అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్‌ పూర్తి చేసింది. తమ ఫ్యామిలీలో ఫాతిమానే మొదటి డాక్టర్‌ అంటూ అలీ దంపతులు ఇటీవల చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..