Vijay: చెన్నైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న ఇళయ దళపతి! ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు

కోలీవుడ్ సూపర్‌స్టార్‌ ఇళయదలపతి విజయ్ (Vijay) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరైన అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులున్నారు.

Vijay: చెన్నైలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొన్న ఇళయ దళపతి! ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు
Hero Vijay
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Aug 29, 2022 | 6:38 AM

కోలీవుడ్ సూపర్‌స్టార్‌ ఇళయదలపతి విజయ్ (Vijay) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దక్షిణాది సినిమా ఇండస్ట్రీల్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో ఒకరైన అతనికి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులున్నారు. అందుకే వారసుడు సినిమాతో నేరుగా టాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌ రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది. అతను భారీ ధర చెల్లించి ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడట. చెన్నై నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఈ లగ్జరీ అపార్ట్‌మంట్‌ను కొనుగోలు చేశాడట. దీని ధర సుమారు రూ.35కోట్లు అని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి.

కాగా ప్రస్తుతం విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్ ప్రాంతంలో తన కుటుంబంతో కలసి నివాసముంటున్నాడు. అయితే ఆ ప్రాంతం రద్దీగా మారడటంతో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడట. అందువల్లే భారీ మొత్తాన్ని చెల్లించి ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అడయార్‌లోని పాత ఇంటిని ఆఫీసుగా ఉపయోగించుకుంటున్నాడు విజయ్‌. ఈ కార్యాలయాన్ని కూడా కొత్తగా కొనుగోలు చేసిన భవనంలోకి తరలించే అవకాశం ఉందట. ఇదిలా ఉంటే ఇళయదలపతి కొనుగోలు చేసిన భవనంలోనే మరో స్టార్ హీరో ఆర్య కూడా ఉంటున్నాడు. కాగా వారసుడు సినిమా పూర్తి కాగానే మళ్లీ లోకేశ్ కనకరాజ్‌తో సినిమా చేయనున్నాడీ స్టార్‌ హీరో. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో మాస్టర్‌ అనే సూపర్‌ హిట్‌ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..