Viral Video: సీలింగ్‌వాల్‌లో నక్కిన కొండ చిలువ.. పట్టుకునేందుకు చూడగా దాడికి యత్నం.. చివరకు ఏమైందంటే?
Python Video: కొండచిలువలు కూడా చాలా ప్రమాదకరమైనవి. అవి విషపూరితమైనవి కావు, కానీ పెద్ద ప్రాణులను కూడా తమ ఆహారంగా చేసుకుని నేరుగా మింగగల సామార్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Python Video: ప్రపంచంలో 2 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయని చెబుతారు. తరచుగా కనిపించే లేదా చాలా అరుదుగా కనిపించే ఈ పాములలో కొన్నింటి గురించి మాత్రమే ప్రజలకు సాధారణంగా తెలుసు. పాములు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి అయినప్పటికీ, అన్ని పాములు ప్రమాదకరమైనవి కావు. కొన్ని పాములు మాత్రం చాలా విషపూరితమైనవి అలాగే ప్రమాదకరమైనవి, వాటికి దూరంగా ఉండటం మంచిది. కింగ్ కోబ్రా, క్రైట్, రస్సెల్స్ వైపర్, సా-స్కేల్డ్ వైపర్ వంటి పాములు చాలా విషపూరితమైనవి. ఇవి కాకుండా కొండచిలువలు కూడా చాలా ప్రమాదకరమైనవి. అవి విషపూరితమైనవి కావు, కానీ పెద్ద ప్రాణులను కూడా తమ ఆహారంగా చేసుకుని నేరుగా మింగగల సామార్థ్యాన్ని కలిగి ఉంటాయి. కొండచిలువలు లేదా ఏవైనా పాములు సాధారణంగా అడవుల్లోనే కనిపిస్తున్నాయి. అయితే అవి కొన్నిసార్లు అవి ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అలాంటిదే కనిపిస్తోంది.
ఈ వీడియోలో ఒక పెద్ద కొండచిలువ ఇంటి పై గోడలో దాక్కుని కూర్చుంది. దానిని పట్టుకునేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించగా.. అది అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో సదరు వ్యక్తి కూడా భయపడతాడు. అయితే వెనక్కు తగ్గకుండా మొదట తోకను పట్టుకుని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తాడు. అయితే పైథాన్ మాత్రం అసలు లొంగదు. మళ్లీ అతనిపై దాడికి ప్రయత్నిస్తుంది. చివరికి, చాలా ప్రయత్నాల తర్వాత పెద్ద కొండచిలువను పట్టుకోవడంలో విజయం సాధిస్తాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో బెస్ట్ వీడియోస్ అనే IDతో షేర్ చేశారు. దీంతో అది కాస్తా క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
Holy shit ???? pic.twitter.com/FD0AgL4u2I
— Best Videos ?? (@_BestVideos) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..