Viral: నెలరోజుల పాటు తాటిచెట్టుపైనే.. ఆహారం, కాలకృత్యాలతో పాటు అన్నీ అక్కడే.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు

Uttar Pradesh: భార్యతో గొడవలతో విసిగి వేసారిపోయిన ఓ వ్యక్తి గత నెల రోజులుగా 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపై జీవనం సాగిస్తున్నాడు. వినడానికి వింతగా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లా కోపగంజ్‌లో చోటుచేసుకుంది.

Viral: నెలరోజుల పాటు తాటిచెట్టుపైనే.. ఆహారం, కాలకృత్యాలతో పాటు అన్నీ అక్కడే.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు
Follow us
Basha Shek

|

Updated on: Aug 27, 2022 | 6:16 AM

Uttar Pradesh: భార్యతో గొడవలతో విసిగి వేసారిపోయిన ఓ వ్యక్తి గత నెల రోజులుగా 80 అడుగుల ఎత్తున్న తాటిచెట్టుపై జీవనం సాగిస్తున్నాడు. వినడానికి వింతగా అనిపించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లా కోపగంజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన రామ్ ప్రవేశ్ (42) అనే వ్యక్తి గత 6 నెలలుగా తన భార్యతో గొడవ పడుతున్నాడు. భార్య ప్రవర్తనకు మనస్తాపం చెందిన అతను గత నెల రోజులుగా తాటి చెట్టుపైనే ఉంటున్నాడు. భార్యతో పాటు కుటుంబ సభ్యులు ఎంత సర్ది చెప్పినా కిందకు దిగి రావడం లేదు. అతని వింత ప్రవర్తనకు విసిగి వేసారిపోయిన వారు కూడా అతనికి తాడు కట్టి ఆహారాన్ని పైకి పంపుతున్నారు. కాగా రామ్‌ రాత్రిపూట చెట్టు దిగి కాలకృత్యాలు తీర్చుకునేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.

కాగా రామ్‌ ఉంటున్న తాటి చెట్టు పక్కనే చాలా ఇళ్లు ఉన్నాయి. కాగా చుట్టుపక్కల వారు తమ ఇళ్లలో ఏమి చేస్తున్నారో అతను గమనిస్తున్నాడని, ఇది తమ గోప్యతకు భంగం కలిగిస్తోందని గ్రామస్తులు ఆక్షిపిస్తున్నారు. పలువురు మహిళలు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రామ్‌ప్రవేశ్‌ను చెట్టు నుంచి కిందకు దిగాలని కోరారు. అందుకు అతను ససేమిరా అన్నాడు. దీంతో చేసేదేమి లేక పోలీసులు అక్కడి నుంచి వీడియో తీసి వెళ్లిపోయారని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా రామ్ ప్రవేశ్ తండ్రి శ్రీకిషున్ రామ్ మాట్లాడుతూ..చెట్టు మీదున్న తమ కుమారుడిని చూసేందుకు ప్రతి రోజూ చుట్టుపక్కల గ్రామ ప్రజలు వస్తున్నారని తెలిపారు. చెట్టు దిగాలని విజ్ఞప్తి చేస్తున్నా తన కుమారుడు వినడం లేదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే