Cat Viral video: ఆన్‌లైన్ క్లాస్‌లో పిల్లి అల్లరి.. టీచర్‌ను ఉద్యోగంలో నుంచి తీసేసారు.. ఎందుకో తెలిస్తే షాకే..
కరోనా వల్ల ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అది చూసి చైనాకు చెందిన ఒక ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ.. కోప్పడటమే కాదు, ఒక ఆర్ట్ టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది.
కరోనా వల్ల ఇంటి నుంచి క్లాసులు చెప్పేటప్పుడు పెంపుడు జంతువులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అది చూసి చైనాకు చెందిన ఒక ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ.. కోప్పడటమే కాదు, ఒక ఆర్ట్ టీచర్‌ను ఉద్యోగం నుంచి తీసేసింది. వివరాల్లోకి వెళితే ఒక ఎడ్‌టెక్ కంపెనీలో ఆర్ట్ టీచర్‌గా పనిచేస్తున్న లువో అనే వ్యక్తి ఆన్‌లైన్ క్లాస్ చెప్తుండగా.. ఇంట్లోని పెంపుడు పిల్లి కెమెరా మీదకు దూకింది. ఇలా నాలుగైదు సార్లు జరిగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సదరు కంపెనీ.. లువోను ఉద్యోగం నుంచి తీసేసింది. ఈ నిర్ణయాన్ని ఆర్బిట్రేషన్‌లో సవాల్ చేయగా.. లువోకు నష్టపరిహారం చెల్లించాలని సదరు కంపెనీని కమిటీ ఆదేశించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ఆ ఎడ్‌టెక్ కంపెనీ కోర్టుకెక్కింది. లువో ప్రవర్తన ‘టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్’కు విరుద్ధంగా ఉందని, క్లాస్ టైంలో వేరే పనులు చేయకూడదని ఆ సంస్థ వాదించింది. ఈ వాదనను తోసిపుచ్చిన కోర్టు కూడా కమిటీ నిర్ణయాన్నే సమర్థించి.. లువోకు 4.6 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తేల్చిచెప్పింది. కరోనా కష్టకాలంలో ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు ఇలాంటివి సహజమని, ఇంటిని ఆఫీసుతో పోల్చలేమని పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

