Viral Video: అరగంటలోనే 21 ప్లేట్ల చోలే కుల్చా తిన్నాడు.. బుల్లెట్ బండి సొంతం చేసుకున్నాడు
Food Challenge: మనం అప్పడప్పుడు ఫుడ్ ఛాలెంజెస్ గురించి వింటూ ఉంటాం. నిర్ణీత సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఆహారాన్ని తినగలిగితే క్యాష్ రివార్డులు లేదా వివిధ రకాల బహముతులు అందిస్తుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్లు తమ ప్రమోషన్లలో భాగంగా ఈ ఫుడ్ ఛాలెంజులు విసురుతున్నాయి

Food Challenge: మనం అప్పడప్పుడు ఫుడ్ ఛాలెంజెస్ గురించి వింటూ ఉంటాం. నిర్ణీత సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఆహారాన్ని తినగలిగితే క్యాష్ రివార్డులు లేదా వివిధ రకాల బహముతులు అందిస్తుంటారు. ముఖ్యంగా రెస్టారెంట్లు తమ ప్రమోషన్లలో భాగంగా ఈ ఫుడ్ ఛాలెంజులు విసురుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు మెట్రోపాలిటన్ నగరాల్లో తరచూ ఇలాంటి ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ గెలుపొందినవారికి భారీ బహుమతులు అందజేస్తున్నారు. అలా తరచూ ఫుడ్ ఛాలెంజ్‌లు నిర్వహించే రెస్టారెంట్లలో ఢిల్లీ (Delhi)లోని చోలే కుల్చా రెస్టారెంట్ కూడా ఒకటి. తాజాగా ఆహార ప్రియులకు మరో సవాల్‌ను విసిరింది. అదేంటంటే అరగంటలో 21 ప్లేట్ల మటర్ చోలే కుల్చే (Chole Kulche) తినాలట. అయితే అది అంత సులభమేమీ కాదు. అయితే రజనీష్ జ్ఞాని అనే యూట్యూబర్, ఫుడ్ బ్లాగర్ ఆ సవాలును స్వీకరించాడు. తను తింటున్నది అరగడానికి మధ్యలో 6 నుంచి 7 గ్లాసుల లస్సీ కూడా తాగాడు. అలాగే మధ్య మధ్యలో గెంతడం, వ్యాయామాలు చేయడం, అటూ ఇటూ తిరగడం వంటివి చేశాడు. మొత్తానికి రెస్టారెంట్ నిబంధనల ప్రకారం 30 నిమిషాల్లో 21 ప్లేట్ల చోలేకుల్చేలు తిని ఛాలెంజ్‌లో గెలిచాడు.
ఇందుకు గాను రెస్టారెంట్ యజమాని నుంచి బుల్లెంట్ బండి తాళం అందుకున్నాడు. అయితే ఇదంతా ప్రమోషన్లలో భాగంగానే చేశానని చెప్పి ఆ బుల్లెట్ బైక్‌ను యజమానికి తిరిగి ఇచ్చాడు. ఈ బైక్ గెలవాలనుకునేవారు ఢిల్లీలోని ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతంలోగల బన్సల్ స్వీట్స్ ఎదురుగా ఉన్న ఆచార్య నికేతన్ మార్కెట్‌లోగల హరి ఓం కే స్పెషల్ చోలే కుల్చేకు విచ్చేయాలని అతను ఆహ్వానించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.




మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
