Sita Ramam: Sita Ramam: అందమైన ప్రేమకథకు వసూళ్ల సునామీ.. 22 రోజులకు గానూ సీతారామం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

Sita Ramam Collections: మలయాళం సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం సీతారామం. హృద్యమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియుల మనసులను బాగా హత్తుకుంది.

Sita Ramam: Sita Ramam: అందమైన ప్రేమకథకు వసూళ్ల సునామీ.. 22 రోజులకు గానూ సీతారామం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?
Sitaramam
Follow us
Basha Shek

|

Updated on: Aug 28, 2022 | 12:26 AM

Sita Ramam Collections: మలయాళం సూపర్‌ స్టార్‌ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), బాలీవుడ్ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటించిన చిత్రం సీతారామం. హృద్యమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియుల మనసులను బాగా హత్తుకుంది. ముఖ్యంగా దుల్కర్‌, మృణాల్‌ల అభినయం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కీలక పాత్రలో నటించిన రష్మిక, అక్కినేని సుమంత్‌ల నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆగస్టు 5న విడుదలైన థియేటర్లలో ఈ ఎపిక్‌ లవ్‌స్టోరీ ఇప్పటికీ విజయవంతంగా రన్‌ అవుతోంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు అందుకున్న ఈ చిత్రం మరో మైలురాయి అందుకుంది. తాజాగా ఈ మూవీ రూ.75 కోట్ల క్లబ్‌లో చేరింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్‌ డాలర్స్‌ కలెక్షన్లను సాధించింది.

ఈ నేపథ్యంలో సీతారామం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్‌. ఫీల్‌ గుడ్ డైరెక్టర్‌ హను రాఘవమూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో తరుణ్‌ భాస్కర్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, ప్రకాశ్‌ రాజ్‌, వెన్నెల కిశోర్‌, మురళీ శర్మ తదితరులు నటించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ ఈ సినిమాను నిర్మించారు. విశాల్‌ చంద్రశేఖర్‌ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..