Krithi Shetty: మల్టీ లింగ్యువల్ బ్యూటీ అన్న ట్యాగ్‌ను కంటిన్యూ చేస్తోన్న బెబమ్మ
సినిమా సక్సెస్ విషయంలో కాస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత నేషనల్ సినిమా అంటే నార్త్ హీరోయిన్ ఉండాల్సిందే అన్న ట్రెండ్ మొదలైంది.
సినిమా సక్సెస్ విషయంలో కాస్టింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత నేషనల్ సినిమా అంటే నార్త్ హీరోయిన్ ఉండాల్సిందే అన్న ట్రెండ్ మొదలైంది. మరి ఈ టైమ్‌లో ఓన్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో మీడియం రేంజ్ సినిమా చేస్తే..? అలాంటి సినిమాల కోసం కూడా ఓ పర్ఫెక్ట్ చాయిస్ ఉందంటున్నారు సౌత్ మేకర్స్. ప్రజెంట్ సౌత్ సర్కిల్స్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్న టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty) . వెండితెర మీదకు ఉప్పెన దూసుకువచ్చిన ఈ భామ.. ఆడియన్స్‌తో నువ్వంటే అదో మాదిరి ఇష్టం బేబమ్మ అనిపించేశారు. అదే జోరు.. మల్టీ లింగ్యువల్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. నాని హీరోగా తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కు దగ్గరయ్యారు కృతి .
రీసెంట్‌గా ది వారియర్ మూవీతో తెలుగు, తమిళ ఆడియన్స్‌ను పలకరించారు. రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ కమర్షియల్ యాక్షన్ సినిమాతో మరోసారి తాను మల్టీ లింగ్యువల్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకోవటమే కాదు.. అలాంటి సినిమాలకు వన్ అండ్ ఓన్లీ చాయిస్ అన్న ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రజెంట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న బైలింగ్యువల్ సినిమాకు కూడా క్రితినే హీరోయిన్‌గా తీసుకున్నారు మేకర్స్. ఆల్రెడీ బంగార్రాజు సినిమాలో ఆకట్టుకున్న ఈ జంట… మరోసారి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతోంది. అంతేకాదు ఈ మూవీతో మల్టీ లింగ్యువల్ బ్యూటీ అన్న ట్యాగ్‌ను సుస్థిరం చేసుకోబోతున్నారు బేబమ్మ.